Hansika Motwanni : భర్త సోహైల్ తో విడాకులు.. అతని గురించి ఈ విషయం తెలుసా.. అంతకుముందే హన్సిక ఫ్రెండ్ తో..
హన్సిక సోహైల్ విడిపోయారు. ఈ విడాకులలో హన్సిక భరణం కూడా తీసుకోలేదని సమాచారం. (Hansika Motwanni)
- Saketh U
- Published On : March 12, 2026 / 08:36 AM IST
Hansika Motwanni
Hansika Motwanni : హీరోయిన్ హన్సిక ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 19 ఏళ్ళు అయినా ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తుంది. 2022లో హన్సిక సోహైల్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వాళ్ళు విడిపోతారని, హన్సిక – సోహైల్ విడాకుల ప్రాసెస్ కూడా మొదలుపెట్టారని వార్తలు వచ్చాయి. నిన్న మార్చ్ 11న వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.
దీంతో హన్సిక సోహైల్ విడిపోయారు. ఈ విడాకులలో హన్సిక భరణం కూడా తీసుకోలేదని సమాచారం. అయితే హన్సిక భర్త సోహైల్ కి గతంలోనే పెళ్లయి విడాకులు అయింది. ఇది సోహైల్ కి రెండో పెళ్లి. రెండో విడాకులు.
Also Read : Kavya Kalyanram : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్..?
సోహైల్ గతంలో హన్సిక ఫ్రెండ్ రింకీ బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రింకీ -సోహైల్ పెళ్ళిలో హన్సిక కూడా సందడి చేసింది. ఈ పెళ్ళితోనే వారిద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత రింకీతో అభిప్రాయ బేధాలు వచ్చి విడాకులు తీసుకున్న సోహైల్ హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
అయితే సోహైల్ – రింకీ విడాకులకు హన్సికనే కారణం అని, రింకీతో పెళ్లి తర్వాతే హన్సిక సోహైల్ కి దగ్గరయింది, హన్సిక వల్లే వాళ్లిద్దరూ విడిపోయారని గతంలో వార్తలు రాగా హన్సిక అవన్నీ తప్పుడు వార్తలు అని స్పందించింది. సోహైల్ గతంలోనే హన్సిక ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోగా ఇప్పుడు హన్సికతో కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం.
Also Read : Adivi Sesh : నాగచైతన్య పెళ్లిని అడివి శేష్ భలే వాడుకున్నాడే.. మంచి పనే చేసాడు..
