Site icon 10TV Telugu

Anandhi : ఆనంది హీరోయిన్ అయినపుడు స్కూల్ చదువుతుందట.. ఏ క్లాస్ తెలుసా? యాక్టింగ్ వద్దనుకుంది.. కానీ..

Do You Know how Actress Anandhi Enters in Movies

Anandhi

Anandhi : తెలుగమ్మాయి ఆనంది మొదట్లో తెలుగులో కొన్ని సినిమాలు చేసి తర్వాత తమిళ్ లో ఛాన్సులు రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే తెలుగులో ఛాన్సులు వస్తున్నాయి. ఆనంది తాజాగా అరేబియా కడలి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంది ఓ ఇంటర్వ్యూలో తాను సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చిందో తెలిపింది.

Also See : Rishab Shetty : వరలక్ష్మి వ్రతం స్పెషల్.. భార్యతో కలిసి పూజలు చేసిన కాంతార హీరో.. ఫ్యామిలీ ఫొటోలు..

ఆనంది మాట్లాడుతూ.. నేను బై ఛాన్స్ యాక్టర్ అయ్యాను. నా మొదటి సినిమా ఈ రోజుల్లో చేసేటప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. నేను ఆట జూనియర్స్ షోలో పార్టిసిపేట్ చేశాను. ఆ షో చూసి మారుతీ సర్ నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే మారుతీ సర్ బస్ స్టాప్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మొదట నాలుగు సినిమాల వరకు ఏదో చేస్తున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను అనే అనుకున్నా. యాక్టింగ్ నా కెరీర్ అని ఆలోచించలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో పార్ట్ టైంలా చేసేదాన్ని. నేను చదువుకోవాలి షూటింగ్స్ వద్దు అనుకునేదాన్ని. కానీ వరుస ఆఫర్స్ వచ్చాయి. తర్వాత తమిళ్ సినిమాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడి డైరెక్టర్స్ వల్ల యాక్టింగ్ ప్రొఫెషనల్ గా తీసుకున్నా. సినిమా గురించి నేర్చుకున్నా. సినిమాలు చేస్తూనే చదివాను. MBA చేశాను అని తెలిపింది.

Also Read : Anchor Ravi : దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.. అందుకే వాళ్ళ మీద కేస్ పెట్టాను..

Exit mobile version