Mahesh Babu Movie: వాట్.. మహేష్ ఫ్యాన్స్ ని భయపెట్టిన సినిమా.. ఆ హీరో చేయాల్సిందా.. జస్ట్ మిస్..
Mahesh Babu Movie: మహేష్ బాబు కెరీర్ లో 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.(Mahesh Babu)
- Saketh U
- Updated on- May 2, 2026 / 05:37 PM IST
Mahesh Babu Brahmotsavam Movie Rejected By Another Hero
Mahesh Babu : మహేష్ బాబు అభిమానులు కలలో కూడా తలుచుకొని సినిమా ఏదైనా ఉందంటే అది బ్రహ్మోత్సవం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా అంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ రోజు భారీగా ఫ్యాన్స్ థియేటర్స్ కి వచ్చారు. కానీ సినిమా చూసి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.
మహేష్ బాబు కెరీర్ లో 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఫ్యాన్స్ ఈ సినిమా గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అయితే అలాంటి డిజాస్టర్ సినిమా వేరే హీరో జస్ట్ మిస్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ చేద్దామనుకొని వదులుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
Also Read : Manchu Lakshmi : ఇన్నేళ్ళుగా.. అదే సమస్యతో బాధపడుతున్న మంచు లక్ష్మి..
మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం సినిమా కథ ముందు ఎన్టీఆర్ దగరికి వెళ్ళింది. ఎన్టీఆర్ కి నిర్మాత BVSN ప్రసాద్ తో ఒక సినిమా చేయాలని అగ్రిమెంట్ ఉంది. ఆ సినిమా శ్రీకాంత్ అడ్డాలతో చేద్దామనుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం స్టోరీ లైన్ చెప్పాడు ఎన్టీఆర్ కి. కథ నచ్చింది కానీ కొన్ని మార్పులు, స్క్రీన్ ప్లే మార్పులు అడిగాడట ఎన్టీఆర్. దాంతో శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేసి మళ్ళీ వినిపించినా ఎన్టీఆర్ పూర్తిగా సంతృప్తి చెందలేదట. అసలే టెంపర్ దాకా వరుస ఫ్లాప్స్ చూసి టెంపర్ నుంచి జాగ్రత్త పడుతున్న ఎన్టీఆర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన బ్రహ్మోత్సవం ఫైనల్ వర్షన్ నచ్చకపోవడంతో సున్నితంగా నో చెప్పాడు.
అలా ఎన్టీఆర్ నో చెప్పిన బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు ఓకే చేసారు. మహేష్ కి శ్రీకాంత్ అడ్డాల ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమా ఇవ్వడంతో ఆయన్ని నమ్మి బ్రహ్మోత్సవం ఓకే చేసాడు. ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో అందరికి తెలిసిందే. బ్రహ్మోత్సవం ని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమాని అగ్రిమెంట్ ఉన్న అదే నిర్మాతకు చేసి హిట్ కొట్టాడు.
Also See: Jaanvi Swarup : మహేష్ బాబు మేనకోడలు.. జాన్వీ స్వరూప్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? హీరోయిన్స్ ని మించి..
