×
Ad

Sai Priya Reddy : చిరంజీవి ఫేవరేట్ సీరియల్ నటి.. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఈమె ఎవరో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలోని సీరియల్‌లో చిరంజీవి ఫేవరేట్ గా నిలిచిన సౌమ్య పాత్రలో నటించిన నటి సాయి ప్రియా రెడ్డి. (Sai Priya Reddy)

Sai Priya Reddy

Sai Priya Reddy : ఇటీవల సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా వచ్చి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో సినిమాలో నయించిన వాళ్ళు కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఒక సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటారు. ఆ సీరియల్ లో నటించే హీరోయిన్ కి కనెక్ట్ అవుతారు.(Sai Priya Reddy)

చిరంజీవి పాత్ర ఆ సీరియల్ గురించి, ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెప్పడం, అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి, సీరియల్స్ ని ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చింది. చిరంజీవి చూసిన సీరియల్ లో హీరోయిన్ సౌమ్య పాత్రలో నటించిన అమ్మాయి పేరు సాయి ప్రియా రెడ్డి. ఈమె తెలుగమ్మాయి.

Also Read : Funky Review : ‘ఫంకీ’ మూవీ రివ్యూ.. జాతి రత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా.. నవ్వించారా..?

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలోని సీరియల్‌లో చిరంజీవి ఫేవరేట్ గా నిలిచిన సౌమ్య పాత్రలో నటించిన నటి సాయి ప్రియా రెడ్డి. అక్కడ సీరియల్ లో కనిపించిన రియల్ లైఫ్ లో ఎప్పట్నుంచో సినిమాలు చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్.. ఇలా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది సాయి ప్రియా రెడ్డి. యూట్యూబ్‌లో పలు సిరీస్‌లు కూడా చేసి ఫేమ్ తెచ్చుకుంది.

ఇటీవల సందీప్ కిషన్ మజాకా, విశ్వక్ సేన్ లైలా సినిమాల్లో కూడా మెప్పించింది. ఇప్పుడిపుడే ఆర్టిస్ట్ గా సినిమాల్లో బిజీ అవుతుంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి బాగా నచ్చిన పాత్రలో నటించడం, స్టేజిపై షీల్డ్ అందుకోవడంతో టాలీవుడ్ బాగానే ఫేమ్ తెచ్చుకొని నటిగా ఆఫర్స్ అందుకుంటుంది సాయి ప్రియా రెడ్డి.

Also Read : Nilave Review : ‘నిలవే’ మూవీ రివ్యూ.. బ్యూటిఫుల్ విజువల్స్ తో కొత్తరకం ప్రేమకథ..