Salman Khan : సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటాను అని అడిగితే.. ఒప్పుకోని హీరోయిన్ తండ్రి.. ఆ హీరోయిన్ మీద ఇష్టంతో..

గతంలో సల్మాన్ పలువురు హీరోయిన్స్ తో ప్రేమాయణం సాగించారని తెలిసిందే.

Do You Know Salman Khan Want to Marry a Heroine but her Father Rejected

Salman Khan : బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది సల్మాన్ ఖాన్. 59 ఏళ్ళు వచ్చినా పెళ్లి మాట ఎత్తకుండా హీరోగా లైఫ్ కొనసాగించేస్తున్నాడు. గతంలో ప్రేమలు, బ్రేకప్ లు, పెళ్లి ప్రయత్నాలు అయ్యాయి కానీ అవేమి వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు అయితే సల్మాన్ పెళ్లి గురించి కూడా ఆలోచించడం మానేసాడు.

గతంలో సల్మాన్ పలువురు హీరోయిన్స్ తో ప్రేమాయణం సాగించారని తెలిసిందే. ఆ లిస్ట్ లో దాదాపు ముగ్గురు నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. కానీ సల్మాన్ ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవానుకున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర ప్రపోజల్ కూడా పెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా.

Also Read : Chiranjeevi : సునీత విలియమ్స్ పై మెగాస్టార్ ట్వీట్.. అడ్వెంచర్ మూవీ అంటూ..

సల్మాన్ ఖాన్ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జుహీ చావ్లాని ఇష్టపడ్డాడు. జుహీ చావ్లా, సల్మాన్ ఖాన్ కలిసి రెండు సినిమాల్లో నటించారు. పలు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు కూడా ఇచ్చారు. అయితే జుహీ చావ్లాని సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట. ఈ విషయం జుహీకి చెప్పకుండా వాళ్ళ నాన్నకి చెప్పడంతో వాళ్ళ నాన్న సల్మాన్ ని రిజెక్ట్ చేసాడంట. దాంతో సల్మాన్ జుహీ విషయం వదిలేసాడు.

ఆ తర్వాత జుహీ – సల్మాన్ కాంబోలో ఒక సినిమా చేయాలనుకున్నా జుహీ ఆ ఆఫర్ కి నో చెప్పింది. వాళ్ళ నన్నే ఆ సినిమాకి నో చెప్పించాడని విబాలీవుడ్ లో రూమర్ ఉంది. ఇక జుహీ చావ్లా 1995 లో బిజినెస్ మెన్ జయ్ మెహతాని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా చాలా ఏళ్ళు సినిమాలు చేసింది. సల్మాన్ ఖాన్ సంగీత బిజ్లానీ, ఐశ్వర్య రాయి, కత్రినా కైఫ్ లతో ప్రేమాయణం నడిపి వాళ్ళతో బ్రేకప్ తర్వాత ప్రస్తుతం ఎలాంటి ప్రేమ, పెళ్లి ఆలోచన లేకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రస్తుతం జుహీ – సల్మాన్ మధ్య మంచి స్నేహం ఉంది. పలు టీవీ షోలలో ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించారు.