Sri Satya : బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీసత్యకి నిశితార్థం అయింది తెలుసా.. కానీ.. ఆ అబ్బాయి ఎవరో తెలుసా??

శ్రీ సత్య మాట్లాడుతూ.. ''నేను ఇలా ఉండటానికి కారణం నాకు ఎదురైన కొన్ని చేదు సంఘటనలే. నాకు ఓ బ్రేకప్ స్టోరీ ఉంది. ప్రేమించి మోసం చేశాడు. నిశితార్థం కూడా జరిగింది. కానీ తర్వాత అది............

Sri Satya :  బిగ్‌బాస్ సీజన్ 6లో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ లో శ్రీ సత్య ఒకరు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది శ్రీ సత్య. అంతేకాక గతంలో మిస్ విజయవాడ టైటిల్ కూడా గెలుచుకుంది. తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక హౌస్ లో టాస్కులు బాగానే ఆడుతున్నా, ఎప్పుడు చూసినా ముభావంగా, డల్ గా ఉంటుంది శ్రీ సత్య. బయట కూడా అలాగే ఉండేది. ఇలా ఉండటానికి తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలే కారణం అని చెప్పింది.

బిగ్‌బాస్ హౌస్ లో తాను అలా ఉండటానికి కారణాలు ఇప్పటికే రెండు సార్లు చెప్పింది శ్రీ సత్య. తాజాగా హౌస్ లో మరోసారి శ్రీ సత్య మాట్లాడుతూ.. ”నేను ఇలా ఉండటానికి కారణం నాకు ఎదురైన కొన్ని చేదు సంఘటనలే. నాకు ఓ బ్రేకప్ స్టోరీ ఉంది. ప్రేమించి మోసం చేశాడు. నిశితార్థం కూడా జరిగింది. కానీ తర్వాత అది క్యాన్సిల్ అయింది. దీనివల్ల నేను ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. మా అమ్మ నా విషయంలో చాలా బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంది. ఇప్పుడు లేవలేని స్థితిలో ఉంది” అని ఎమోషనల్ అయి ఏడ్చేసింది.

బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లే ముందే ఓ యూట్యూబ్‌ చానల్‌ కి ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీసత్య. ఆ ఇంటర్వ్యూలో కూడా తన బ్రేకప్ గురించి మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో.. ”టీనేజ్‌లో ఉన్నపుడు పవన్‌ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించాను, అయితే ఆ రిలేషన్‌ ఇప్పుడు బ్రేక్‌ అయ్యింది. ప్రేమించిన వ్యక్తితోనే నిశ్చితార్థం జరిగింది. కానీ మా ఫ్యామిలీస్ కి మా పెళ్లి ఇష్టం లేదు. తర్వాత మా ఇద్దరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. దీంతో నిశితార్థం ఆగిపోయింది” అని తెలిపింది శ్రీ సత్య.

Naga Shaurya : నా దగ్గరేం డబ్బులు లేవు.. హీరో అయ్యాకే కారు, ఇల్లు కొనుక్కున్నాను.. మా అమ్మ నా కోసం ఇప్పటికి వడ్డీలు కడుతుంది..

అయితే శ్రీ సత్యకి నిశితార్థం అయింది కూడా ఓ ఆర్టిస్ట్ తోనే, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో పవన్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయమై వీరిద్దరూ నిశితార్థం దాకా వెళ్లారు. పవన్ రెడ్డి కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి ఒక షార్ట్ ఫిలిం కూడా చేశారు. అయితే ప్రస్తుతం పవన్ ఎక్కువగా నటించట్లేదు. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో, ఎందుకు నిశితార్థం క్యాన్సిల్ అయిందో వీరికే తెలియాలి.

 

ట్రెండింగ్ వార్తలు