Naga Shaurya : నా దగ్గరేం డబ్బులు లేవు.. హీరో అయ్యాకే కారు, ఇల్లు కొనుక్కున్నాను.. మా అమ్మ నా కోసం ఇప్పటికి వడ్డీలు కడుతుంది..

నాగశౌర్య మాట్లాడుతూ.. ''ఇక్కడ అందరూ కష్టపడే పైకొచ్చారు. ఈ సినిమా చాలా ఆలస్యం అయింది కరోనా వల్ల. ఈ సినిమా నిర్మాత నేను కాదు, మా అమ్మ. సినిమా మీద, నా మీద ప్రేమతో మా అమ్మ నన్ను నమ్మి డబ్బులు.................

Naga Shaurya : నా దగ్గరేం డబ్బులు లేవు.. హీరో అయ్యాకే కారు, ఇల్లు కొనుక్కున్నాను.. మా అమ్మ నా కోసం ఇప్పటికి వడ్డీలు కడుతుంది..

Naga Shaurya emotional speech at Krishna Vrinda Vihari Pre Release Event

Updated On : September 22, 2022 / 7:23 AM IST

Naga Shaurya :  నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మించిన సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. ఎప్పుడో కరోనా ముందు మొదలుపెట్టిన ఈ సినిమా కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా చేస్తున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న శౌర్యకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో నాగశౌర్య ఎమోషనల్ గా మాట్లాడాడు.

నాగశౌర్య మాట్లాడుతూ.. ”ఇక్కడ అందరూ కష్టపడే పైకొచ్చారు. ఈ సినిమా చాలా ఆలస్యం అయింది కరోనా వల్ల. ఈ సినిమా నిర్మాత నేను కాదు, మా అమ్మ. సినిమా మీద, నా మీద ప్రేమతో మా అమ్మ నన్ను నమ్మి డబ్బులు పెడుతుంది. ఈ నిర్మాణ సంస్థ నా ఒక్కడికోసం పెట్టలేదు. వేరే హీరోలు, డైరెక్టర్లు కూడా ఇందులో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో మా అమ్మ ఇప్పటికి వడ్డీలు కడుతుంది.”

Ekta Sharma : ఒకప్పుడు సీరియల్స్ లో స్టార్.. ఇప్పుడు అవకాశాలు లేక కాల్ సెంటర్లో జాబ్

”ఇటీవల నేను పాదయాత్ర చేసినప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నాకు ఇండస్ట్రీ ఇష్టం సర్, నన్ను కూడా తీసుకెళ్లండి అన్నాడు, మీకేంటి సర్ మీ దగ్గర డబ్బులున్నాయి మీరు సినిమాలు తీసుకుంటారు అన్నాడు. మేమంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. నేను హీరో అయ్యాకే సొంత కారు, ఇల్లు కొనుక్కున్నాను. సక్సెస్ అయ్యాకే కొనుక్కున్నాను. సినిమాల్లోకి రాకముందు మా దగ్గర కూడా డబ్బులు లేవు. మీరు కూడా కష్టపడి ఎదగండి” అని ఎమోషనల్ గా మాట్లాడారు.