Surabhi Das : సాయి పల్లవిని డామినేట్ చేసి వైరల్ అవుతున్న ఈ నటి ఎవరో తెలుసా? ‘రామాయణ’లో ఆ పాత్రలో..
సాయి పల్లవి కంటే ఈమె బాగుంది అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తున్నాయి. (Surabhi Das)
- Saketh U
- Published on- August 1, 2026 / 12:02 PM IST
Surabhi Das
Surabhi Das : ఇటీవల బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణ ట్రైలర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సాయి పల్లవి కంటే కూడా ఆమె వెనక ఉన్న మరో నటి బాగా వైరల్ అయింది. సాయి పల్లవి కంటే ఈమె బాగుంది అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ నటికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా పెరిగారు.
ఇంతకీ ఆ నటి ఎవరు, రామాయణంలో ఆమె ఏ పాత్ర చేసిందంటే.. ఆ నటి పేరు సురభి దాస్. ఈమె ఒక అస్సామీ నటి. అస్సామీలో పలు సీరియల్స్ లో నటించింది సురభి దాస్. ఇటీవలే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్, సినిమాలు, టీవీ షోలు చేస్తుంది. రామాయణ ట్రైలర్ తర్వాత తన ఫోటో వైరల్ అవ్వడంతో సురభి దాస్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
Also Read : Sri Gouri Priya : ‘చెన్నై లవ్ స్టోరీ’ భామ.. సక్సెస్ తర్వాత చీరకట్టులో క్యూట్ గా..
ఆ ఇంటర్వ్యూలో సురభి దాస్ మాట్లాడుతూ.. నేను ఊర్మిళ పాత్ర నటిస్తున్నాను అని వార్తలు వచ్చాయి కానీ అది అబద్దం. నేను సీత ఇంకొక చెల్లి, శత్రఘ్నుడి భార్య శ్రుతకీర్తి పాత్రలో నటించాను. ఈ సినిమాలో నాది చిన్న పాత్రే అయినా ఇంత పెద్ద సినిమా, రామాయణంలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకు నేను ఆడిషన్ ఇచ్చాను. నాకు సెలెక్ట్ అయ్యాను అని కాల్ వచ్చినప్పుడు కూడా అది నిజం అని షూటింగ్ కి వెళ్ళేదాకా నమ్మలేదు. నాకు లుక్ టెస్ట్, కాస్ట్యూమ్ టెస్ట్ కూడా చేసి సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిపింది.
ట్రైలర్ లో ఒక్క చిన్న షాట్ తో సాయి పల్లవి కంటే ఎక్కువ వైరల్ అయింది సురభి దాస్. రాత్రికి రాత్రి స్టార్ డమ్ వచ్చేసింది. దీంతో రామాయణ తర్వాత ఈ భామకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని తెలుస్తుంది. ఇక ఈ అస్సామీ నటి సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తుంది.
