Unstoppable episode 2 : అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ గెస్టులు ఎవరో తెలుసా??
రెండో ఎపిసోడ్ లో ఎవరు రానున్నారో అంటూ ఓ హింట్ ఇచ్చింది ఆహా టీం. ఒక రెండు పజిల్స్ ఇచ్చి సెకండ్ ఎపిసోడ్ కి ఎవరు రానున్నారో కనిపెట్టండి అంటూ ఆహా టీం ప్రేక్షకులకి సవాలు విసిరింది. దీంతో ఈ పజిల్స్ ని.........
- Saketh U
- Published On : October 16, 2022 / 09:08 AM IST
Do you know Unstoppable episode 2 guests
Unstoppable episode 2 : బాలయ్య బాబు ఆహాలో మొదలుపెట్టిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే ఊపులో సీజన్ 2ని కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. గతంలో కంటే మరిన్ని అంచనాలు ఈ సీజన్ పై ఉండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సరికొత్త రికార్డుని సృష్టించింది.
ఇక రెండో ఎపిసోడ్ లో ఎవరు రానున్నారో అంటూ ఓ హింట్ ఇచ్చింది ఆహా టీం. ఒక రెండు పజిల్స్ ఇచ్చి సెకండ్ ఎపిసోడ్ కి ఎవరు రానున్నారో కనిపెట్టండి అంటూ ఆహా టీం ప్రేక్షకులకి సవాలు విసిరింది. దీంతో ఈ పజిల్స్ ని సాల్వ్ చేసి అన్‌స్టాపబుల్ షో రెండో ఎపిసోడ్ కి రానున్న గెస్టులు ఎవరో నెటిజన్లు కామెంట్స్ లో చెప్పేస్తున్నారు.
ఆహా టీం ఇచ్చిన పజిల్స్ ప్రకారం అన్‌స్టాపబుల్ షో రెండో ఎపిసోడ్ కి డీజేటిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహాశెట్టి అలాగే యువ హీరో విశ్వక్ సేన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు యువ హీరోలతో బాలయ్య ఈ ఎపిసోడ్ లో రచ్చ చేయనున్నట్టు సమాచారం. ఇక ఆహా కూడా అధికారికంగా వీరిద్దరూ వస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఫుల్ ఫేమ్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు రానుండటంతో యూత్ ఈ ఎపిసోడ్ కి మరింత కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు. త్వరలోనే అన్‌స్టాపబుల్ షో సెకండ్ ఎపిసోడ్ రానుంది.
Are you ready for a crazyy Unstoppable episodee up next???
Drop your guesses on guests in the comments below ?#UnstoppableWithNBKS2 #NandamuriBalakrishna pic.twitter.com/p2HTyUD6q2
— ahavideoin (@ahavideoIN) October 15, 2022
