Operation Valentine : వరుణ్ కోసం రాబోతున్న మెగాస్టార్.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ వేడుక టైమ్.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జెట్ ఫైటర్స్‌గా నటిస్తున్న 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు? ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?

Operation Valentine : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-శక్తిప్రతాప్ సింగ్ హడా కాంబోలో వస్తున్న సినిమా ‘ఆపరేషన్ వాలంటైన్’. మార్చి 1న రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా జరగబోతోంది. పద్మవిభూషణ్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

Operation Valentine 1

Ground : ‘గ్రౌండ్’ మూవీ రివ్యూ.. సినిమా అంతా గ్రౌండ్‌లోనే.. కొత్తవాళ్లు చేసిన ఈ ప్రయత్నం చూడాల్సిందే..

ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’ మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. సందీప్ ముద్ద నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా చేస్తున్నారు.  రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Trisha Krishnan : త్రిష టార్గెట్‌గా వరుస వివాదాలు.. ఇదంతా పొలిటికల్ గేమా?

ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్ సినిమా అంచనాల్ని పెంచేసింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఫిబ్రవరి 25న హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్స్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించబోతోంది.  ఈ ఈవెంట్‌కు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేయాలని మూవీ టీం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరి అక్కడ వరుణ్ సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

ట్రెండింగ్ వార్తలు