Do you know who is this heroine is taking the trophy on stage as a child
Tollywood Actress : పైన ట్రోఫీ తీసుకుంటున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇటీవల డార్లింగ్ సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న స్వయంభు సినిమాలో నటిస్తుంది.
Also Read : Robinhood : నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ వచ్చేసింది..
అయితే నేడు చిల్డ్రన్స్ డే సందర్బంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలు ఫోటోలను షేర్ చేసింది. చిన్నప్పుడు తన స్కూల్ లో ట్రోఫీ, మెడల్ తీసుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. టోఫీస్ కంటే ట్రోఫీలను తీసుకోవడం అంటేనే ఎక్కువ ఇష్టమని.. చిన్నారులందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఆ పోస్టులో పేర్కొంది. దీంత ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక ఈ బ్యూటీ ఎల్లపుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది.