Dongalunnaru Jaagratha Trailer Creates Buzz
Dongalunnaru Jaagratha: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం.కీరవాణి కొడుకుగా సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సింహా కోడూరి, తన తొలి సినిమా ‘మత్తు వదలరా’తోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సినిమా సిరకొత్త కాన్సెప్ట్‌తో రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
‘తెల్లవారితే గురువారం’, ‘భాగ్ సాలే’ అంటున్న శ్రీ సింహా..
‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సతీశ్ త్రిపుర తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ అంటోంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నింపేశారు చిత్ర యూనిట్. ఒక కారు దొంగతనానికి వెళ్లిన హీరో, అనుకోకుండా అందులో చిక్కుకుపోవడంతో.. అతడు ఆ కారులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు.
Sri Simha : ‘యమదొంగ’ లో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసింది ఈ హీరోనే! తర్వాత ‘బాహుబలి’ లో కూడా..
ఇక సర్వైవల్ థ్రిల్లింగ్ అంశాలతో ఈ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉంది. ఇక ఈ ట్రైలర్‌లోని షాట్స్‌కు తగ్గట్టుగా కాళభైరవ అందించిన బీజీఎం కూడా సూపర్బ్‌గా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాను ఫస్ట్ తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.