Shilpa Shetty
Shilpa Shetty On Husband Raj Kundra Arrest: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మొదటిసారి, శిల్పాశెట్టి, ఈ మొత్తం వివాదంపై నిశ్శబ్దాన్ని వీడారు. ఈ ప్రకటనలో.. ఈ విషయం కోర్టులో ఉన్నందున మౌనంగా ఉన్నట్లు శిల్పాశెట్టి రాసుకొచ్చింది. ఈ విషయంపై నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఈ విషయం ఇంకా కోర్టులో ఉన్నందున ఇకపై కూడా మాట్లాడను అంటూ పోస్ట్‌లో వెల్లడించారు.
“అవును! గడిచిన కొంతకాలం నాకు ఎంతో ఛాలంజింగ్.. నేను ఎంతో బాధపడ్డాను.. పుకార్లు, ఆరోపణలు అనేకం వస్తూనే ఉన్నాయి. మీడియాతో పాటు శ్రేయోభిలాషులుగా అనుకున్నవారు సైతం నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నన్ను మాత్రమే కాదు.. నా కుటుంబాన్ని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వ్యాఖ్యానించలేను. అయితే, దయచేసి నా భర్తపై తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేయడం ఆపండి. సెలబ్రిటీగా నా ఫిలాసఫీ ఏంటంటే “ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.. వివరించవద్దు”.
ముంబై పోలీసులపై, న్యాయవ్యవస్ధపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓ కుటుంబంగా న్యాయపరమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నా.ఓ తల్లిగా నా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా.. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించకండి.. ముఖ్యంగా తల్లిగా నా పిల్లల గోప్యతను గౌరవించమని, నిజం ఏంటో తెలుసుకోకుండా తెలిసీ తెలియని సమాచారంతో వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాను.
నేను భారతీయ పౌరురాలిని. గత 29 సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తున్న నటిని. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరినీ నిరాశపరచలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో నా కుటుంబం గోప్యతపై ‘నా హక్కు’ను గౌరవించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అంటూ ఆమె పోస్ట్ చేశారు.