Dora Sai Teja : యూట్యూబ్ స్టార్.. ఇప్పుడు ఓటీటీలో సిరీస్.. తర్వాత సినిమా..
దందా వెబ్ సిరీస్ సక్సెస్ అనంతరం దొర సాయి తేజ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Dora Sai Teja)
- Saketh U
- Published on- August 9, 2026 / 09:28 PM IST
Dora Sai Teja
Dora Sai Teja : పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటుడిగా, డబ్బింగ్ లతో చిన్న వయసులోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు దొర సాయి తేజ. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల దొర సాయి తేజ హీరోగా దందా అనే వెబ్ సిరీస్ వచ్చింది. చాయ్ షాట్స్ ఓటీటీలో వర్టికల్ వెబ్ సిరీస్ గా దందా వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దందా వెబ్ సిరీస్ సక్సెస్ అనంతరం దొర సాయి తేజ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
దొర సాయి తేజ తన గురించి చెప్తూ.. ప్రభాస్ అడవి రాముడు సినిమాతో పాటు చాలా సినిమాలకు, కొన్ని కార్టూన్స్ కి డబ్బింగ్ తో కెరీర్ మొదలుపెట్టాను. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాను. 2016లో ఆర్జీవీ పరిచయంతో సినిమా, యూట్యూబ్ లో కంటెంట్ మొదలయింది. గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీ కూడా మొదలుపెట్టాను. వ్యాపారస్థుడిగా, నటుడిగా, కంటెంట్ క్రియేటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాను. కంటెంట్ క్రియేషన్ నా బిజినెస్. సినిమా నా ప్యాషన్. ఈ రెండూ కలిపితే నేను అని తెలిపారు.
Also Read : Mega Family : హిట్స్ తో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ.. నెక్స్ట్ ఎవరు?
తనకు ఫేమ్ తెచ్చిపెట్టిన సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రతీ వీడియోకి ప్రశంసలు, తిట్లు వస్తాయి. ఇక్కడ నా ఫాలోయింగ్‌ని నా కోసం సినిమా థియేటర్ వరకు తీసుకు రావాలని అనుకుంటున్నాను. కొద్దిగా ఫాలోవర్లు, లైకులు, షేర్లు కనిపించాయంటే చాలు చూసే జనాలంతా ‘లైఫ్ అంటే వీడిది రా’ అనుకుంటారు. కానీ కాదు. వైకుంఠపాళీ లాగా నిచ్చెనెక్కిచ్చేది, తేడా కొడితే క్రింద పడేసేది అదే దీంట్లోకి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రశంసకీ విమర్శకీ రెండింటికి సిద్ధంగా ఉండాలి. నేను చేసిన కంటెంట్‌లో నా ఫాలోవర్స్ వాళ్లని వాళ్లు చూసుకుని కనెక్ట్ అయ్యారు. మీరు ఫాలో అయ్యే ఇన్‌ఫ్లూయన్సర్ ఏం పోస్టు పెట్టేరు అనేది ఖచ్చితంగా గుర్తుంటది. సో సెలబ్రిటీస్, స్పోర్ట్స్‌మేన్ కంటే ఎక్కువ జనాలు ఇన్‌ఫ్లూయన్సర్స్‌ని అడ్మైర్ చేస్తారు, వాళ్ళ లుక్స్, స్టైల్‌ని గమనిస్తారు. కాబట్టి ఇన్‌ఫ్లూయన్సర్ ఏం చేసినా, మాట్లాడినా, బట్టలు వేసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు.
దందా వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. నేను దందాలో అరవింద్‌గా మాత్రమే కనిపిస్తాను. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలే రావాలని కోరుకున్నాను. నేను దాదాపు అన్నీ కూడా సింగిల్ టేక్‌లోనే చేసేస్తాను. టేక్స్ ఎక్కువ అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. డైరెక్టర్ ఆదిత్య పేపర్ మీద రాసుకున్నది అవుట్ పుట్‌గా తీసుకువచ్చారు. అది మామూలు విషయం కాదు. ఆయన విజన్ వల్లే ఈ సిరీస్ ని ఏడు రోజుల్లో 30 కాల్షీట్స్‌లో పూర్తి చేశాం. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడి పని చేశాం అని తెలిపారు.
Also Read : Nagavamsi : హీరోలు అడ్వాన్స్ లు తీసుకోవడం మానేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత..
అలాగే.. భవిష్యత్తులో సాధారణ వ్యక్తి రిలేట్ అయ్యే కథల్ని థియేటర్‌లో చూపించాలని, జీరో టు హీరో పాత్రలను పోషించాలని కోరుకుంటున్నాను. అందరిలో స్పూర్తి నింపే కథల్ని, మంచి సందేశాన్ని ఇచ్చే ప్రాజెక్ట్‌ల్ని చేయాలని అనుకుంటున్నాను. ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలని అనుకుంటానని తెలిపాడు దొర సాయి తేజ.
