బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్.. ఇవాళ రాహుల్.. రేపు మరొకరు

  • Publish Date - September 21, 2019 / 02:05 PM IST

సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 3’ ఈసారి మాత్రం సంచనాలు పెద్దగా లేకుండా సరదాగా.. కాస్త భావోద్వేగంగా సాగుతుంది. బిగ్ బాస్ నామినేషన్లలో గత వారాలకు భిన్నంగా బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను ఒక గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ పెట్టి అందులో ఫోన్ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడి నామినేట్ చేశారు.

నామినేట్ అయిన వారి కోసం ఇతర సభ్యులు కొన్ని త్యాగాలు చేయడంతో కొందరు సేఫ్ అయ్యారు. హిమజ త్యాగం విఫలం అవడంతో మహేష్ నామినేట్ అవ్వగా.. అలాగే రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అవ్వాలంటే పునర్నవి నామినేట్ అవ్వాలనే త్యాగాన్ని రాహుల్ ఒప్పుకోకపోవడంతో తనని తానే ఈ వారం నామినేట్ చేసుకున్నాడు రాహుల్. ఇక కెప్టన్ వితిక డైరెక్ట్ గా హిమజను నామినేట్ చేసింది.

ఈ ముగ్గురిలో రాహుల్ మాత్రం సేఫ్ అవ్వొచ్చని, హిమజ లేదా మహేష్ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చని అబిప్రాయాలు వినిపించాయి. అయితే అందరూ అనుకున్నట్లే చేస్తే బిగ్ బాస్ ఎందుకు అవుతాడు. ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెట్టేశాడు.. శనివారం(21 సెప్టెంబర్ 2019) ఒకరు.. ఆదివారం(22 సెప్టెంబర్ 2019) మరొకరు హౌస్ నుంచి వెళ్లిపోనున్నారు.

వీకెండ్‌లో రెండు రోజులు నాగార్జున వస్తాడు కాబట్టి ఒకరోజు ఒకరిని, ఇంకోరోజు ఒకరిని బయటకు పంపనున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో తొలిరోజు ఎలిమినేట్ అయ్యేది రాహుల్ సిప్లిగంజ్ అని అర్థం అవుతుంది. ప్రోమోలోనే అది రివీల్ చేసారు నిర్వాహకులు. రెండవరోజు హిమజా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి బిగ్ బాస్ ఆలోచన ఎలా ఉందో?