Double Ismart director Puri Jagannadh about Amish people in Puri Musings
Puri Musings : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్.. ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) అనే పోడ్ కాస్ట్ ద్వారా పలు విషయాలపై తన అభిప్రాయాలు, ఆలోచన విధానాలతో పాటు కొత్త విషయాలను కూడా ఆడియన్స్ కి తెలియజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా పెన్సిల్వేనియాలో జీవించే అమిష్ ప్రజలు గురించి తెలియజేసారు. ప్రస్తుత ప్రపంచం 5gతో సూపర్ ఫాస్ట్ గా నడుస్తుంది.
అయితే అమిష్ ప్రజలు మాత్రం 18వ శతాబ్దంలోనే ఆగిపోయారట. అక్కడ అసలు కరెంట్ అనేది ఉండదట. ఇక కరెంటే లేనప్పుడు ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్ వంటి సౌకర్యాలు ఎక్కడ ఉంటాయి. కేవలం ఈ సౌకర్యాలకు మాత్రమే కాదు ఫోన్, కార్స్ అండ్ బైక్స్ కూడా అక్కడ కనిపించవట. 300 ఏళ్ల క్రితం ఎలా జీవించేవారో.. ఇప్పటికే అదే జీవనశైలిలో బ్రతుకు వస్తున్నారు. ఊరిలోని అందరూ క్రమశిక్షణతో కలిసిమెలిసి ఉంటారు.
ఒక్కరికి ఆపద వచ్చినా అందరూ కలిసిపోతారు. బంధాలకు ఎక్కువ విలువనిస్తారు. ఉమ్మడిగా ఉండడానికి ఇష్టపడతారు. బంధాలకు విలువనిస్తూ, ప్రకృతి గౌరవిస్తూ.. వారి మత గ్రంథంలో చెప్పినట్లు జీవిస్తూ.. ఈ మోడరన్ యుగంలో తమకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని, బయట ప్రపంచానికి దూరంగా బ్రతుటుకుంటారు. బయట ప్రపంచం వారిని కలిసేందుకు, వారికీ ఇంటర్వ్యూలు లేదా ఫోటోలు ఇచ్చేందుకు కూడా ఒప్పుకోరట.
Also read : Tenant Review : సత్యం రాజేష్ ‘టెనెంట్’ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆకట్టుకుందా..!
ఇక అక్కడి పిల్లలు కూడా ఎక్కువుగా చదువుకోరట. సాయంత్రం అయితే అందరూ ఒక చోట కలిసి సరదాగా గడుపుతారట. ఆదివారం వస్తే పూర్తి విశ్రాంతి తీసుకుంటారట. ఇక భార్యాభర్తలు ఒకే మంచం పై పడుకుంటారు గాని, మధ్యలో ఒక చెక్క ముక్క పెట్టుకుంటారా. నిద్రలో కూడా ఒకర్ని ఒకరు తాకకుండా. ఇలా పూర్తిగా పాతకాలం జీవినంతోనే జీవిస్తూ వస్తున్నారట.
ఈ విషయాన్ని పూరి తెలియజేస్తూ.. అమిష్ ప్రజలు చేస్తున్నది చాలా కరెక్ట్ అని. కుదిరితే వారి గురించిన సినిమాలు చూడడండి అంటూ తెలియజేసారు. కాగా హాలీవుడ్ లో ఈ ప్రజల గురించి ఎన్నో సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.