Due Date : కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా.. కొత్త సినిమా ‘డ్యూ డేట్‌’ ఓపెనింగ్..

లోమేష్‌ పూడిపెద్ది, జయశ్రీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం డ్యూ డేట్‌ (Due Date)

Due Date Movie pooja ceremony in Hyderabad

Due Date : లోమేష్‌ పూడిపెద్ది, జయశ్రీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం డ్యూ డేట్‌. ఆనంద్‌.కె దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. వర్షిష్‌ స్టూడియోస్‌ పతాకంపై ఏలూరు శ్రీను, పవన్‌ తరిగోపు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ప్రణీత పట్నాయక్‌, విజాక్ష‌నిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ నివ్వగా, నిర్మాత బన్నీవాస్‌ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్‌కేఎన్‌, ధీరజ్‌ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు.. దర్శకుడు విజయ్‌ కనకమేడల, విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.

Dhamaal 4 : ధమాల్ 4 సాంగ్ వ‌ర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కేతిక శ‌ర్మ‌.. ఫోటోలు

ఈ చిత్రం ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందని, టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఉంటాయని నిర్మాత‌లు తెలిపారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు.