క్లీన్ ‘యూ’: ఎంత మంచివాడవురా.. సింగిల్ కట్ లేదు

  • Publish Date - January 7, 2020 / 05:44 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వెగెశ్న దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎంత మంచివాడవురా’.   క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా వస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ వాళ్లు క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎలాంటి అసభ్యకరమైన సీన్ లేకండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా ఇటీవలికాలంలో వచ్చిన సినిమా ఇదే.

‘శతమానం భవతి’ సినిమా తర్వాత సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పోటీలో జవనరి 15వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘ఎంత మంచివాడవురా’ పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా జనవరి 8వ తేదీన జరగనుంది.

ఈ సంధర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మా `ఎంత మంచివాడ‌వురా` సినిమా ప్రేక్ష‌కుల ముంందుకు వ‌స్తుంది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవ‌డ‌మే కాదు.. సింగిల్ క‌ట్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన ఎమోషన్స్‌తో సాగే కుటుంబ క‌థా చిత్ర‌మిది“ అని అన్నారు.