Erra Cheera
Erra Cheera : బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటిస్తుండగా సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు, జీవా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Erra Cheera)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శక నిర్మాత సుమన్ బాబు నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.
Also Read : Anna Lezhneva : వరంగల్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన పవన్ భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి..
సుమన్ బాబు మాట్లాడుతూ.. ఎర్రచీర మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడింది. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తీసుకొని కొంత కల్పిత కథ జోడించి ఈ సినిమాని తెరకెక్కించాను. షూటింగ్ 37 రోజుల్లోనే పూర్తయినా CG వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. గ్రాఫిక్స్ అవుట్‌పుట్ సంతృప్తిగా అనిపించకపోవటంతో మూడు చోట్ల చేయించాము. ఈ సినిమాలో దాదాపు 23 మంది ప్రముఖ నటులు నటించారు అని తెలిపారు.
అలాగే.. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. మదర్ సెంటిమెంట్ ఉన్న డిఫరెంట్ కంటెంట్. అదే రోజు రిలీజ్ అవుతున్న సినిమాలతో పోటీ గురించి భయం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం బి, సి సెంటర్ల థియేటర్లలో ప్రతి షోకి లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం. మేము ట్రైలర్ ని ఎప్పుడో రిలీజ్ చేసాము. మా సినిమాలో పాప పాలు తాగే షాట్‌ను కాపీ కొట్టి అక్షయ్ కుమార్ సినిమా భూత్ బంగ్లాలో పెట్టారు. ఎర్రచీరకు సీక్వెల్ కూడా ఉంది అని తెలిపారు.
Also See : Genelia Deshmukh : వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. అప్పటి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన జెనీలియా..