Ester Noronha: విడాకుల తరువాత నోయెల్ నాపై నెగటివ్ ప్రచారం చేశాడు.. యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులు.. నటి ఎస్తర్ నోరోన్హ!

నటి ఎస్తర్ నోరోన్హ.. సునీల్ హీరోగా నటించిన "భీమవరం బుల్లోడు" సినిమాతో తెలుగు వారికీ దగ్గరయిన నటి. కొంకణి ఫిలిం ఇండస్ట్రీలో సింగర్ గా పాపులర్ అయిన ఈ భామ తెలుగు, కన్నడ, కొంకణి భాషలో నటించింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన '1000 అబద్దాలు' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరోయిన్.. తెలుగు రాప్ సింగర్ నోయెల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.

Ester Noronha comments on Divorse with Noel Sean

Ester Noronha: నటి ఎస్తర్ నోరోన్హ.. సునీల్ హీరోగా నటించిన “భీమవరం బుల్లోడు” సినిమాతో తెలుగు వారికీ దగ్గరయిన నటి. కొంకణి ఫిలిం ఇండస్ట్రీలో సింగర్ గా పాపులర్ అయిన ఈ భామ తెలుగు, కన్నడ, కొంకణి భాషలో నటించింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘1000 అబద్దాలు’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరోయిన్.. తెలుగు రాప్ సింగర్ నోయెల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.

Noel Sean : ప్రముఖ సింగర్ తండ్రి కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న టాలీవుడ్ సింగర్లు..

“నోయెల్ సీన్” తెలుగులో రాప్ సింగర్ గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రథంగా ఎస్తర్ అండ్ నోయెల్ సింగెర్స్ కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. 2019 జనవరిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి అయిన ఆరు నెల్లలుకే విబేధాలు వచ్చి ఈ జంట విడాకులు తీసుకుంది.

అయితే విడిపోయాక నోయెల్ తనపై నెగటివ్ ప్రచారం చేశాడంటూ ఎస్తర్ ఇటీవల ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. “విడాకుల తరవాత నోయెల్ తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో అతను ఆ విడాకుల విషయాన్ని సానుభూతి కోసం వాడుకున్నాడు. అంతేకాదు నాపై అతను చేసిన నెగటివిటీకి ఒక అతను హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానంటూ నన్ను బెదిరించాడు” అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.