ET Express : సైంధవ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆ రోజే.. యానిమల్ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్‌

టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్‌డేట్స్ చూసేయండి.

ET 7 Latest Entertainment News Today On 16 November At 10pm

సైంధవ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌..
విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఈ నెల 21న విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఇంట్రస్టింగ్ వీడియోను విడుద‌ల చేసింది.

 యానిమల్ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్‌..
సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రణబీర్, రష్మిక జంటగా న‌టించిన మూవీ యానిమల్. డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను లేటెస్ట్‌గా విడుద‌ల చేశారు. ఫుల్ ఇంటర్వ్యూ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

ఈ వారంలోనే ఫైటర్ టీజ‌ర్‌..
హృతిక్ రోషన్ , దీపికా పదుకొనే జంట‌గా న‌టిస్తున్న చిత్రం ఫైటర్. సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 25 జ‌న‌వ‌రి 2024లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్లు స్టార్ట్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ వారంలోనే ఈ మూవీ టీజ‌ర్‌ను విడుదల చేయ‌నున్న‌ట్లు బాలీవుడ్‌లో టాక్‌.

ధ్రువ‌న‌క్ష‌తం నుంచి ఒక మది సాంగ్..
తమిళ్ స్టార్ హీరో విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రీతు వర్మ హరీష్ జయరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ద్రువ నక్షత్రం . న‌వంబ‌ర్ 24న రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ చిత్రం నుంచి ఒక మది సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.

‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్..
సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న మూవీ హ‌రోం హ‌ర‌. జ్ఞానసాగర్ ద్వారక ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) పతాకంపై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక శర్మ ను దేవిగా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.

రేపు ఆదికేశవ ట్రైలర్‌ రిలీజ్‌..
ఆదికేశవ మూవీ ట్రైలర్‌ రేపు గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌పై ఈ మూవీ రిలీజ్‌ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన లీలమ్మ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

ప్రజాకవి కాళోజీ బయోపిక్ టీజర్..
మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ప్రజాకవి కాళోజీ బయోపిక్. విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం.

అమెజాన్‌లో దూత వెబ్ సిరీస్‌..
నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ దూత. విక్రమ్‌ కె.కుమార్‌ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ డిసెంబరు 1న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్ డేట్ మార‌నుందా..?
విశ్వక్‌సేన్ హీరోగా న‌టించిన సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌. డిసెంబ‌ర్ 8న ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని అనౌన్స్ చేశారు. అయితే.. అదే వారంలో నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ రిలీజ్ కి రెడీ అవ్వడంతో ఎందుకొచ్చిన రిస్క్ అని డిసెంబర్ 8 నుంచి డేట్ మార్చుకోవాడానికే ట్రై చేస్తున్నారు.

అట్లీ కొత్త మూవీలో హాలీవుడ్ రైటర్?
డైరెక్టర్‌ అట్లీ తన నెక్స్ట్‌ మూవీ కోసం బిగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్‌ రైటర్‌తో కలిసి పనిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మూవీని మల్టీ స్టారర్‌గా షారూఖ్‌, విజయ్‌తో కలిసి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మరోవైపు అట్లీ డైరెక్షన్‌లో వచ్చి జవాన్‌ వెయ్యి కోట్ల గ్రాస్‌ క్లబ్‌లో చేరింది.