టీనేజ్ లవ్ స్టోరీ, రివేంజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఎవడు తక్కువ కాదు మే 11న రిలీజ్ కానుంది..
ఎవడి గోల వాడిది, స్టైల్, వియ్యాల వారి కయ్యాలు, నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా వంటి పలు హిట్ సినిమాలు నిర్మించిన లగడపాటి శ్రీధర్ తనయుడు, రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ మెయిన్ లీడ్‌గా రూపొందుతున్న సినిమా.. ‘ఎవడు తక్కువ కాదు’.. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’.. అనేది ట్యాగ్ లైన్.. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శిరీష సమర్పణలో, లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. రఘు జయ దర్శకుడు. ప్రియాంక జైన్ కథానాయిక. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గోలీసోడా’ కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసారు.
నా పేరు సూర్య లో మహిదేవ్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేసాడు, సినిమా సినిమాకి అతను నటుడిగా ఎదుగుతున్నాడు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని సుకుమార్ అన్నారు. టీనేజ్ లవ్ స్టోరీ, రివేంజ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఎవడు తక్కువ కాదు మే 11న రిలీజ్ కానుంది. తమిళ్ వెర్షన్‌లో నటించిన మధు సూదన్‌రావు ఇందులోనూ విలన్ క్యారెక్టర్ చేసాడు. ఆర్ కె, రఘు కారుమంచి, రాఘవ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం : హరి గౌర.
వాచ్ ట్రైలర్..