Evelyn Sharma To Become Mother Of Her 2nd Child
Evelyn Sharma: బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. బాలీవుడ్‌లో ‘యే జవానీ హై దివానీ’ మూవీతో మంచి ఫేం సాధించిన ఈ బ్యూటీ, ఆ తరువాత వరుసగా సినిమాలు చేసింది. అయితే ఈ బ్యూటీకి స్టార్‌డమ్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అయితే ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘సాహో’లో తన నటనతో సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ చిన్నది.
2021లో తన బాయ్‌ఫ్రెండ్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకుంది ఎవెలిన్. ఆ తరువాత వీరిద్దరికీ ఓ పాప జన్మించింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది. తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఎవెలిన్ పోస్ట్ చేసిన ఫోటోలతో తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. తాము త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె సంతోషంగా తెలియజేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవెలిన్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ బ్యూటీ త్వరలోనే మరోసారి తల్లి కాబోతుండటంతో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవెలిన్ ప్రస్తుతం సినిమాలను చాలా తక్కువగా చేస్తుండటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.