యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా నుండి చైతు లుక్ విడుదలైంది..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో సూపర్ కూల్ లుక్‌లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చైతు బర్త్‌డే సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. చైతు హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది.
నేచురల్ క్యారెక్టర్స్‌తో బ్యూటిఫుల్ కథలను తెరపై ఆవిష్కరించే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య లుక్, క్యారెక్టర్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలోకి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త ఎక్స్ పీరియన్స్‌గా ఉండ బోతుంది ఆ వీడియో.
Read Also : దర్శకుడి చెల్లెల్ని పెళ్లాడుతున్న కమెడియన్
సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఏమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
టెక్నికల్ టీమ్ :
ఆర్ట్ : రాజీవ్ నాయర్
కెమెరా : విజయ్ సి కుమార్
మ్యూజిక్ : పవన్
సహా నిర్మాత: విజయ్ భాస్కర్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం : శేఖర్ కమ్ముల.
Experience the world of #NC19 on 23rd Nov at 10:30 am
@sekharkammula @Sai_Pallavi92 #SreeVenkateswaraCinemasLLP #AmigosCreations @adityamusic pic.twitter.com/rEokRKklye
— chaitanya akkineni (@chay_akkineni) November 21, 2019