×
Ad

Aavesham : మలయాళంలో మరో హిట్టు బొమ్మ.. ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’.. ఇది కూడా తెలుగులోకి వస్తుందా?

తాజాగా మలయాళంలో మరో సినిమా హిట్ కొట్టింది. పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ హీరోగా 'ఆవేశం' అనే సినిమా నిన్న మలయాళంలో రిలీజయింది.

  • Published On : April 12, 2024 / 09:05 AM IST

Fahadh Faasil Malayalam Movie Aavesham got hit Talk Buzz Creating in Telugu

Aavesham : ఇటీవల మలయాళంలో సినిమాలు వరుస హిట్స్ కొట్టి భారీ కలెక్షన్స్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. మన తెలుగోళ్లకు మలయాళ సినిమాలు బాగా నచ్చేస్తుండటంతో వాటిని డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్.. ఇలా వరుసగా మలయాళం సినిమాలు తెలుగులో రిలీజయి ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.

తాజాగా మలయాళంలో మరో సినిమా హిట్ కొట్టింది. పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్(Fahadh Faasil) హీరోగా ‘ఆవేశం’ అనే సినిమా నిన్న మలయాళంలో రిలీజయింది. ఇందులో ఫహద్ రంగా అనే రౌడీ పాత్రని పోషించాడు. క్రైం కామెడీగా ఈ సినిమా ఉందని, సినిమా అదిరిపోయిందని మలయాళం ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ సినిమాని 20 కోట్లతో తెరకెక్కించగా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని 5 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. ఈ సినిమాని ఫాహద్ మరొకరితో కలిసి నిర్మించాడు. ఆవేశం సినిమాని మలయాళంలో ఆల్రెడీ ‘రోమాంచమ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన జీతూ మాధవన్ తెరకెక్కించాడు.

Also Read : Payal Rajput : బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఒడిస్సాలోని ఆలయాన్ని సందర్శించిన పాయల్ రాజ్‌పుత్

దీంతో ఈ సినిమాపై తెలుగులో కూడా బజ్ క్రియేట్ అయింది. తెలుగులో కూడా ఫహద్ ఫాజిల్ కి మార్కెట్ ఉంది. పుష్ప సినిమాతో ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు ఫాహద్. మరి త్వరలో తెలుగులోకి ఈ ఆవేశం సినిమాని తీసుకొస్తారేమో చూడాలి.