Family Star : ఫ్యాన్స్‌తో విజయ్, మృణాల్ హోలీ సెలబ్రేషన్స్.. డాన్స్ వీడియో వైరల్..

ఫ్యాన్స్‌తో విజయ్, మృణాల్ హోలీ సెలబ్రేషన్స్ చూసారా. డాన్స్ చేస్తూ..

Family Star : పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేసారు.

నేడు హోలీ సందర్భంగా ఈ సాంగ్ ని ఫ్యాన్స్ మధ్య సెలబ్రేషన్స్ తో రిలీజ్ చేసారు. హైదరాబాద్ లో ఫ్యాన్స్ మధ్య హోలీ రంగులతో ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్ సందడి చేసింది. దర్శకనిర్మాతలతో పాటు విజయ్ అండ్ మృణాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, ఫ్యాన్స్ పై రంగులు జల్లుతూ హోలీ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటూ డాన్స్ వేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు.

Also read : Gangs of Godavari : ఐటెం సాంగ్‌తో ‘మోత మోగిపోద్ది..’ అంటున్న విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్పెషల్ సాంగ్ రిలీజ్..

ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ హోలీ సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ‘మధురము కదా..’ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఆ మెలోడీ సాంగ్ ని కూడా వినేయండి.

కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. పరుశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గతంలో గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఇప్పుడు ఆ కాంబో ఫ్యామిలీ స్టార్ తో వస్తుండడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ కాంబినేషన్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు