Gangs of Godavari : ఐటెం సాంగ్‌తో ‘మోత మోగిపోద్ది..’ అంటున్న విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్పెషల్ సాంగ్ రిలీజ్..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి 'మోత మోగిపోద్ది..' అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు.

Gangs of Godavari : ఐటెం సాంగ్‌తో ‘మోత మోగిపోద్ది..’ అంటున్న విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్పెషల్ సాంగ్ రిలీజ్..

Vishwaksen Ayeshakhan Gangs of Godavari Motha Mogipoddi Song Released

Updated On : March 25, 2024 / 1:43 PM IST

Gangs of Godavari : విశ్వక్‌ సేన్ (Vishwaksen) ఇటీవలే గామి సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో రాబోతున్నాడు. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో నేహశెట్టి (Neha Shetty) హీరోయిన్ గా, అంజలి (Anjali) ముఖ్య పాత్రలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా పీరియాడిక్ గా గోదావరి జిల్లాల్లో రాజకీయ కథాంశంతో తెరకెక్కబోతుందని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ‘మోత మోగిపోద్ది..’ అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో అయేషా ఖాన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఇక ఈ పాటని చంద్రబోస్ రాయగా యువన్ శంకర్ రాజా దర్శకత్వంలో మానసి పాడింది.

Also Read : Krithi Shetty : కళ్ళతో మాయ చేస్తున్న కృతిశెట్టి.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?

ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన చేసిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మోత మోగిపోద్ది అంటూ మరోసారి కుర్రాళ్ళ గుండెల్లో తన అందాలతో మోత మోగించేస్తుంది. మీరు కూడా వినేయండి ఈ స్పెషల్ సాంగ్ ని.