KS Sethumadhavan : ప్రముఖ దర్శకుడు కెఎస్ సేతుమాధవన్ కన్నుమూత

దక్షిణ భారత ప్రమఖ దర్శకుడు కెఎస్‌. సేతు మాధవన్‌ కన్నుమూశారు. ఈయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Ks Sethumadhavan

KS Sethumadhavan : దక్షిణ భారత ప్రమఖ దర్శకుడు కెఎస్‌. సేతు మాధవన్‌ కన్నుమూశారు. వృద్దాప్యలో వచ్చే సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల సేతు మాధవన్‌ చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1961లో డైరెక్టర్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సేతు మాధవన్ 60చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

చదవండి : Sirivennela : సిరివెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

మళయాళంతోపాటు, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు తెరకెక్కించారు. తెలుగులో ఈయన డైరెక్ట్ చేసిన సినిమా స్త్రీ.. ఇది 1995లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 1971లో పునర్జన్మ అనే చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రానికి సేతు మాధవన్ కు ఫిలింఫేర్ అవార్ద్ దక్కింది. కేరళలోని పాలక్కడ్‌లో 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్‌. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్‌, ఉమ, సంతోష్ సేతు మాధవన్‌ ఉన్నారు.

చదవండి : Sirivennela : సిరివెన్నెలపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్