Famous Indians their first cars: Sachin Tendulkar to Katrina Kaif : పాపులర్ సెలబ్రిటీలు ఎప్పుడూ ఏదో కొత్త కారు తీస్తూనే ఉంటారు. వారి లగ్జరీ లైఫ్ లో ఇది చాలా కామన్.. ఇవాళ ఒక కారుతో కనిపిస్తే.. మరో రోజు కొత్త కారుతో కనిపిస్తూ ట్రెండ్ సెట్ చేస్తుంటారు. ఇండియన్ సెలబ్రిటీల్లో ఎక్కువగా మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త లగ్జరీ కారు మోడల్ ట్రయల్ చేస్తుంటారు. అయితే ప్రతి సెలబ్రిటీ తమ లైఫ్‌లో వాడిన మొదటి కారు అంటే ఎప్పటికీ మెమరీగా ఉండిపోతుంది. ఎన్ని కొత్త కార్లను కొన్నప్పటికీ తమ లైఫ్ టైంలో సెంటిమెంట్‌గా వాడిన ఫస్ట్ కార్లను మాత్రం వదిలిపెట్టకుండా తమతో అలానే అట్టిపెట్టేసుకుంటున్నారు.
సెలబ్రిటీలు ఖరీదైన వాహనాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తమ హోదాకు తగినట్టుగా కారు మోడల్ సెలెక్ట్ చేసి కొనేస్తుంటారు. అందులోనే సిటీలో చక్కర్లు కొడుతుంటారు. సెలబ్రిటీలు తమ లైఫ్ లో వాడిన ఫస్ట్ కార్లు ఏంటో తెలుసా? అయితే ఇక్కడ కొంతమంది భారతీయ సెలబ్రిటీల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ వరకు వాడిన ఫస్ట్ కార్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన అభిమాన సెలబ్రిటీ ఫస్ట్ కారు ఏది వాడారో ఓసారి లుక్కేయండి..
Sachin Tendulkar :
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వాడిన ఫస్ట్ కారు మారుతీ సుజూకీ 800. సచిన్ గ్యారేజ్ ఎప్పుడూ హైఎండ్ ఖరీదైన కార్లతో నిండి ఉంటుంది. సచిన్ వాడిన ఫస్ట్కారు ఇదే.. మారుతీ సుజూకీ 800. భారత మార్కెట్లో 1980లో మారుతీ సుజూకీ లాంచ్ అయిన తొలినాళ్లలో సచిన్ ఈ మోడల్ కారు కొన్నాడు. ఇటీవలే సచిన్ ఈ కారుతో దిగిన ఫొటో ఒకటి ఆన్ లైన్ లో పోస్టు చేశాడు.
బాలీవుడ్ ఫేమస్ మూవీ డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీ ఫస్ట్ కారు.. మారుతీ సుజూకీ 800. ఈయన వాడిన మొదటి కారు ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇమ్తియాజ్ స్టయిలీస్ లైఫ్ స్టయిల్ ఫాలో అవుతుంటారు. తన మొదటి కారు ఇంకా తనతో పాటే ఉంచుకున్నారు. ఇప్పటికీ తన హోం గ్యారేజీలోనే ఉంది. ఇంకా యూరోపియన్ మ్యానిఫ్యాక్చరింగ్ లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ కుల్ గా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. ఇటీవలే రజనీ లగ్జరీ SUV కార్లలో ఇన్నోవాను కొనుగోలు చేశారు. అయితే రజినీ తన లైఫ్ లో ఫస్ట్ వాడిన కారుతో దిగిన ఫొటోను కుటుంబ సభ్యులు పోస్టు చేశారు. రజినీ నివాసం వద్ద ప్రీమియర్ పద్మిణీ కారు పార్క్ చేసి ఉంది. సూపర్ స్టార్ ఫస్ట్ కారు ఇదే.. ఇప్పటీకీ ఈ కారు కండీషన్ బాగానే ఉందంట..
బాలీవుడ్ బ్యూటీ కాజల్ అంటే అప్పట్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను కాజల్ పెళ్లాడింది. అజయ్ దేవగన్ ఆటోమొబైల్ లవర్.. మార్కెట్లోకి వచ్చే ప్రతి లగ్జరీ కార్లపై లుక్కేస్తుంటారు. కాజల్ దేవగన్ ఇంట్లో లగ్జరీ బ్రాండ్ల కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. అందులో Rolls Royce Cullinan మోడల్ కారు ఒకటి. ఇక కాజల్ వాడిన మొదటి కారు మారుతీ సుజూకీ 1000. మారుతీ 800 ఆధారంగా ఈ కొత్త మోడల్ Sedan కారు అప్పట్లో మార్కెట్లోకి వచ్చింది. ఆ రోజుల్లో ఈ కారు ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది.
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా అందరికి తెలుసు. ఆయన ఎప్పుడూ జీప్ కంపాస్ వెహికల్‌లోనే ఎక్కువగా తిరుగుతుంటారు. సారా అలీ ఖాన్ మొదటి కారు Honda CR-V. వైట్ కలర్ రంగులో ఉండే ఈ కారును ఇంకా సారా వాడుతునే ఉంది. కొన్నిచోట్ల సారా వేర్వేరు SUV కార్లలో కూడా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. చాలా ఏళ్ల నుంచి ఈ కారును సారా వాడుతోంది.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెకు లగ్జరీ కార్ల కంటే ఎంతో ఇష్టం. Mercedes-Maybach లగ్జరీ కార్లను వాడే అతికొద్ది సెలబ్రిటీల్లో దీపికా ఒకరు. ఆమె భర్త రన్ వీర్ సింగ్ కూడా స్పోర్టీ కారు, ఒక లగ్జీ కార్లను వాడుతున్నారు. దీపికా ఫస్ట్ కారు.. Audi Q7. కొన్నాళ్ల పాటు దీపికా Audi A8L కారు మోడల్ కూడా వాడారు.
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్.. తన వ్యక్తిగత జీవితంలో చాలా హుందాగా ఉంటారు. సింపుల్ గా ఉంటారు. అలా అనీ కార్లపై పెద్దగా ఆసక్తి లేదని కాదు.. కొన్నేళ్ల క్రితం శ్రద్ధా తన ఫస్ట్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. అదే.. Mercedes-Benz ML-Class .. ఈ కొత్త బ్లాక్ ML-Class SUV కారులోనే ఎక్కడికైనా వెళ్తుంటోంది. శ్రద్ధాకు ఈ కారు ఒక్కటే ఉంది.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. ఫస్ట్ కారు Audi Q7. ఎప్పటినుంచో ఇదే కారును మెయింటైన్ చేస్తున్నారు కత్రినా. చాలాకాలం పాటు కొత్త కారుకు మారలేదు. ఇటీవలే కత్రినా Land Rover Range Rover మోడల్ ఒకటి తీశారు. ఈ కారును సల్మాన్ ఖాన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు కత్రినా Q7 కారు మోడల్ తీసుకుంది.