Allu Arjun : అల్లుఅర్జున్‌ని పట్టుకొని ఏడ్చేసిన అభిమాని.. వైరల్ అవుతున్న వీడియో..

కొంతమంది తమ హీరోని కలిస్తే ఆనందంతో సంబరపడతారు. తాజాగా ఓ అభిమాని అల్లు అర్జున్ ని కలిసాడు.

Fan Emotionalized after meeting Allu Arjun First Time Video goes Viral

Allu Arjun : అల్లు అర్జున్ కి మన రాష్ట్రంలోనే కాక పుష్ప(Pushpa) సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అల్లు అర్జున్ ఆర్మీ అని అభిమానులు హంగామా చేస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల వైజాగ్ కి అల్లు అర్జున్ వెళ్తే అభిమానులు భారీగా వచ్చి బన్నీని ర్యాలీగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఫేవరేట్ హీరోలని కలవాలని, వాళ్ళతో ఫోటోలు దిగాలని, వారితో మాట్లాడాలని అభిమానులు ఎదురు చూస్తుంటారు.

ఒక్కోసారి సినిమా ఈవెంట్స్ లో సడెన్ గా స్టేజి ఎక్కేసి తమ హీరోని కలవాలని కూడా ప్రయత్నిస్తుంటారు అభిమానులు. కొంతమంది తమ హీరోని కలిస్తే ఆనందంతో సంబరపడతారు. తాజాగా ఓ అభిమాని అల్లు అర్జున్ ని కలిసాడు. దీంతో అల్లు అర్జున్ ని హత్తుకొని ఆనందంతో ఏడ్చాడు. బన్నీ సెక్యూరిటీ అతన్ని పక్కకి పంపించేద్దామని ట్రై చేసినా అల్లు అర్జున్ వారించి అతన్ని ఓదార్చాడు.

Also Read : Anand Devarakonda : రష్మిక మందన్నని ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తాడో తెలుసా?

అల్లు అర్జున్ ఆ అభిమానిని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఓదార్చాడు. దీంతో ఆ అభిమాని చాలా సంతోషంతో పొంగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా మా హీరో అంటూ బన్నీ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి బన్నీని అంతా అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు