Bhumika Chawla : భూమిక కోసం రాసిన లవ్ లెటర్‌ని.. ఆమె భర్తకే షేర్ చేసిన అభిమాని..
ఒక అభిమాని భూమికకు లవ్ లెటర్ రాసి.. దానిని ఆమె భర్తకి పంపించి, దానిని మీ భార్యకి వినిపించండి అని చెప్పాడట.
- gum 95921
- Updated on- December 3, 2023 / 09:49 PM IST
Fan write love letter for Bhumika Chawla and sent to her husband
Bhumika Chawla : ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక.. కెరీర్ స్టార్టింగ్ లోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నారు. సౌత్ టు నార్త్ పలు భాషల్లో నటించిన భూమిక.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్, టీవీ షోలు కూడా చేస్తూ వస్తున్నారు. కాగా భూమిక 2007లో భారత్ ఠాకూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే, భూమిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంటారు. ఆమెకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంటారు.
అంతేకాదు అందమైన ఫోటోషూట్స్ కూడా చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానులను ఫిదా చేస్తుంటారు. ఇక తాజాగా ఆమె కొత్త చీర ఫోటోలు షేర్ చేశారు. అయితే ఆ పోస్ట్ కింద భూమిక రాసుకొచ్చిన కామెంట్ అందర్నీ ఆకర్షిస్తుంది. ఒక అభిమాని ఆమె భర్తకి ఒక లవ్ లెటర్ పంపించి.. ఇది మీ భార్యకి వినిపించండి అని చెప్పుకొచ్చాడట. ఇక దానిని భూమిక షేర్ చేస్తూ.. ‘ఆ లవ్ లెటర్ తనని ఆకట్టుకుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Anasuya Bharadwaj : కేటీఆర్ సర్.. మరోసారి ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు : అనసూయ
కాగా భూమిక 2000లో సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘యువకుడు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. రెండో సినిమాని తమిళంలో చేశారు. ఇక మూడో సినిమాగా పవన్ ఖుషిలో నటించి ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత మహేష్ బాబుతో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. ప్రస్తుతం అక్క, అమ్మ పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.
