Fans are not allowed at Prabhas's Raja Saab movie pre-release event.
The Rajasaab: ది రాజాసాబ్ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు(డిసెంబర్ 27) సాయంత్రం హైదరాబాద్ లో జరుగనున్న ది రాజాసాబ్(The Rajasaab) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రేక్షకులకు, అభిమానులకు అనుమతి లేదంటూ ప్రకటించారు. కేవలం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని కోరారు మేకర్స్. వేదిక పరిమితులు అలాగే భారీగా జన సమూహం వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఈవెంట్ కి ప్రేక్షకులకు అనుమతులు ఇవ్వలేదట. కాబట్టి, ప్రభాస్ ఫ్యాన్స్ ది రాజాసాబ్ ఈవెంట్ ను ఇంట్లోనే ప్రత్యేక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందింగా కోరారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
Nidhi Agarwal: ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదట.. నిధి పాప ఏంటి అలా అనేసింది.. ఫ్యాన్స్ ఏమంటారో..