The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజే.. వెన్యూ ఎక్కడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రాజాసాబ్(The Rajasaab)'. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజే.. వెన్యూ ఎక్కడో తెలుసా?

Prabhas The Raja Saab movie pre-release event update

Updated On : December 27, 2025 / 7:10 AM IST

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ గా ప్రభాస్ లుక్స్ కి క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. మిర్చి తరువాత అవుట్ అండ్ అవుట్ ట్రెండీ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుండటంతో అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Swapna Dutt: ఏది పడితే అది కట్ చేస్తే సినిమా ఏం ఉంటుంది.. రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్వప్న దత్‌

ఈనేపధ్యంలోనే ది రాజా సాబ్(The Rajasaab) ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 27న అంటే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ హైదరాబాద్ లో భారీగా జరుగనుంది. దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని మేకర్స్ తెలిపారు. ఇక కల్కి సినిమా తరువాత చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుంది. దీంతో, తమ అభిమాన హీరోని చూసుకునేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.