Varanasi: లుక్ మొత్తం మార్చేసిన మహేష్ బాబు.. ఆ పాత్ర కోసమేనా.. పిక్స్ వైరల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి(Varanasi). ఈ సినిమాను గ్లోబల్ లెవల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.
Mahesh Babu in a new look for Varanasi film.
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ సినిమాను గ్లోబల్ లెవల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. దీంతో, ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి అంతా ఈ సినిమాపైనే ఉంది. ఇక ఇటీవల చేసిన వారణాసి మూవీ ఈవెంట్ కి, విడుదల చేసిన టైటిల్ వీడియోకి ఏ రేంజ్ లో అప్లాజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. ఆ అంచనాలను అందుకునేందుకు మేకర్స్ కూడా ఎక్కడా వెనుకాడటం లేదు. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించేందుకు ఏకంగా రూ.1300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
Naveen Polishetty: ఆ రూ.400 విలువ నాకు బాగా తెలుసు.. నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ కామెంట్స్
ఇదిలా ఉంటే, వారణాసి సినిమా కోసం చాలా కాలంగా మహేష్ బాబు లాంగ్ హెయిర్ అండ్ గడ్డం ఉన్న లుక్ ను మెయింటైన చేస్తున్నాడు. అయితే, రీసెంట్ గా మాత్రం ఆయన కాస్త కొత్త లుక్ లో కనిపించాడు మహేష్. క్రిస్మస్ ఫెస్టివల్ లో భాగంగా మహేష్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ లుక్ రాముడి పాత్ర కోసమే అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ విషయం గురించి టైటిల్ రివీల్ ఈవెంట్ లో చెప్పేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తాడని చెప్పాడు. దానికి సంబందించిన 60 రోజుల షూట్ కూడా జరిగిందని చెప్పారు.
అప్పటినుంచి రాముడిగా మహేష్ బాబు ఎలా ఉంటాడు అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న లుక్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాముడిగా మహేష్ బాబు పర్ఫెక్ట్ సెట్ అవుతాడని,మీసాలు లేకుండా ఉన్న ఆ నీట్ లుక్ ఆయనకు బాగా సెట్ అవుతుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వారణాసి సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఏంఏం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక వారణాసి సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahesh babu
