Lokesh Kanagaraj: ప్లాప్ మూవీ ప్రభావం అలా ఉంటుంది.. ఎన్నో విమర్శలు అంటూ.. లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కూలీ సినిమా గురించి, ఆ సినిమాపై వచ్చిన విమర్శల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

Lokesh Kanagaraj: ప్లాప్ మూవీ ప్రభావం అలా ఉంటుంది.. ఎన్నో విమర్శలు అంటూ.. లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Lokesh Kanagaraj made emotional comments regarding the criticism about 'Coolie' movie.

Updated On : December 27, 2025 / 9:33 AM IST

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) గురించి, ఆయన సినిమాల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చేసినవి 5 సినిమాలే కానీ అందులో మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు ఈ దర్శకుడు. దీంతో, తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు. అందుకే, ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ, అదంతా ఈ దర్శకుడు హిట్స్ ఉన్నంత కాలం మాత్రమే. ఇప్పుడు ఈ దర్శకుడు ప్లాప్ లో ఉన్నాడు. అందుకే, ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Varanasi: లుక్ మొత్తం మార్చేసిన మహేష్ బాబు.. ఆ పాత్ర కోసమేనా.. పిక్స్ వైరల్..

రీసెంట్ గా ఈ దర్శకుడి నుంచి వచ్చిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి ప్లాప్ గా నిలిచింది. కనీసం నార్మల్ ఆడియన్స్ ఈ సినిమాను ఘోరంగా రిజెక్ట్ చేశారు. ఈ ఒక్క ప్లాప్ లోకేష్ కెరీర్ ను తలకిందులు చేసింది. అంతకు ముందు పిలిచి మరీ ఆఫర్స్ ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు దగ్గరకు కూడా రావడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే తాజాగా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దర్శకుడు కూలీ సినిమా గురించి, ఆ సినిమాపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చాడు.

నేను డైరెక్ట్ చేసిన కూలీ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. నా తర్వాత సినిమాలో వాటిని తప్పకుండా సరిద్దుకుంటాను. ఎన్ని ట్రోల్స్‌ వచ్చినా సినిమా లవర్స్ రజనీకాంత్‌ కోసం థియేటర్స్ కి వెళ్లారు. ఈ సినిమా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది అని నిర్మాత చెప్పినప్పుడు ఆనందం వేసింది. ఈ విషయంలో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నిజానికి, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా కథలు రాయడం నాకు రాదు. కానీ, నేను రాసుకున్న కథలోని పాత్రలు ప్రేక్షకుల అంచనాలు చేరువైతే ఆనందపడతాను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతి, లోకేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దర్శకుడి నుంచి రానున్న కొత్త సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.