Ram Charan : రామ్ చరణ్ కార్‌ని వెంబడించిన ఫ్యాన్స్.. చరణ్ ఏం చేశాడో తెలుసా?

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ షూట్ అక్కడే జరుగుతుంది.

Fans Followed Ram Charan Car after Game Changer Shoot in Hyderabad Ram Charan Reaction goes Viral

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. డైరెక్టర్ శంకర్(Director Shankar) ఇటీవలే కమల్ హాసన్ తో సినిమా పూర్తి చేయడంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూట్ శరవేగంగా చేస్తున్నారు.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారం ఏరియాల్లో జరుగుతుంది. గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ షూట్ అక్కడే జరుగుతుంది. చరణ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున చరణ్ ని చూడటానికి తరలి వస్తున్నారు. షూట్ ప్లేస్ నుంచి కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా లీక్ అవుతున్నాయి.

అయితే నిన్న రాత్రి చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ ముగించుకొని ఇంటికి బయలుదేరగా కొంతమంది అభిమానులు చరణ్ కారుని వెంబడించారు. వాళ్లకు అందకుండా చరణ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాడేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ చరణ్ కార్ ని స్లో చేసి కార్ విండో దించి ఫ్యాన్స్ కి అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెనక్కి వెళ్ళండి అని చెప్పాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేరే హీరోలైతే ఫ్యాన్స్ వెంబడిస్తే కార్ ని ఇంకా ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారేమో, చరణ్ అభిమానులని పలకరించి వెళ్ళాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Tripti Dimri : విజయ్ దేవరకొండ సరసన యానిమల్ భామ త్రిప్తి దిమ్రి.. శ్రీలీల తప్పుకుందా?

ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, SJ సూర్య.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజవ్వొచ్చని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు