Nidhhi Agerwal
Nidhhi Agerwal : హీరోయిన్ నిధి అగర్వాల్ నిన్న హైదరాబాద్ లులు మాల్ లో జరిగిన రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ ఈవెంట్ అనంతరం వెళ్లిపోతుండగా ఆమెని అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. పలువురు ఆమెని తాకుతూ, ఆమె బట్టలు పట్టుకొని, ఆమె దారికి అడ్డుగా ఉండి అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ఆమె వెళ్లిపోవడానికి చాలా కష్టపడింది. దీంతో నిధి అగర్వాల్ ని ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు హీరోయిన్స్ ని ఇలా ట్రీట్ చేస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు.(Nidhhi Agerwal)