Ram Charan : తప్పు తనదే అని రామ్ చరణ్ చెప్పారు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. ఫైట్ మాస్టర్ వివరణ..
ఇటీవల పెద్ది సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో రామ్ చరణ్ కి కంటి మీద గాయం అయిన సంగతి తెలిసిందే. దానిపై ఫైట్ మాస్టర్ స్పందించారు.(Ram Charan)
- Saketh U
- Updated on- May 16, 2026 / 08:34 PM IST
Ram Charan
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఈ సినిమాపై హైప్ నెలకొంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం పెద్ది సినిమాకు వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పెద్ది సినిమాకు పనిచేసిన ఫైట్ మాస్టర్స్ లో ఒకరైన నవకాంత్ మాస్టర్ నేడు మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. అయితే ఇటీవల పెద్ది సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో రామ్ చరణ్ కి కంటి మీద గాయం అయిన సంగతి తెలిసిందే. దానిపై ఫైట్ మాస్టర్ స్పందించారు.
Also Read : Jungle Boogie : అడవిలో రియాలిటీ షో.. జంగిల్ బుగి.. మీరు పాల్గొనాలి అనుకుంటున్నారా?
ఫైట్ మాస్టర్ నవకాంత్ మాట్లాడుతూ.. ఆ రోజు కుస్తీ పోటీలకు సంబంధించిన సీక్వెన్స్ షూట్ చేస్తున్నాము. చరణ్ గారు ఒక మనిషిని ఎత్తి తిప్పి పడేయాలి. అవతలి వ్యక్తి కూడా చరణ్ గారిని ఎత్తి పడేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సీన్ చేసేటప్పుడు అనుకోకుండా చరణ్ గారికి అవతలి వ్యక్తి గట్టిగా తగిలి గాయం అయింది. ఇద్దరూ పడిపోయారు.
వెంటనే అందరూ చరణ్ గారి దగ్గరకు పరిగెత్తారు కానీ చరణ్ మాత్రం అందరు నా దగ్గరికే వస్తే ఎలా అతనికి కూడా ఏమైనా అయిందేమో చూడండి అని అన్నారు. అంత మంచి మనుసున్న వ్యక్తి. చరణ్ నాదే తప్పు ఆ అబ్బాయిది ఏం తప్పులేదు. నేనే సరిగ్గా చేయలేదు అని చెప్పారు. హాస్పిటల్ కి వెళ్లి కుట్లు వేయించుకొని ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ తర్వాత రోజే షూటింగ్ కి వచ్చేసారు. అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి చరణ్ అని తెలిపారు.
Also Read : Anna Lezhneva : తన పెంపుడు కుక్కలతో పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా లెజినోవా ఫొటోలు వైరల్..
