Gold Scam : గోల్డ్ స్కామ్‌లో సినీ ప్రొడ్యూసర్ అరెస్ట్..
గోల్డ్ స్కామ్ కేసులో (Gold Scam )'లఫూట్ గ్యాంగ్' సినిమా నిర్మాత కే. లక్ష్మీకాంత్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు అరెస్ట్ చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 29, 2026 / 10:40 PM IST
Film Producer Lakshmi Kantha Reddy Arrested In Gold Scam
Gold Scam : గోల్డ్ స్కామ్ కేసులో ‘లఫూట్ గ్యాంగ్’ సినిమా నిర్మాత కే. లక్ష్మీకాంత్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి బాధితుడి నుంచి రూ.2.21 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఆరోపణ. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, తనతో పాటు తన కుటుంబాన్ని బెదిరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Varun Tej : మరోసారి మంచి మనసును చాటుకున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్..
స్థానిక పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సీసీఎస్‌కు బదిలీ చేయగా.. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 351(2) కింద కేసు నమోదు చేశారు.
నిందితుడిపై గతంలోనే నాలుగు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించగా, ప్రస్తుత కేసుతో కలిపి మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడించిన పోలీసులు.
