Rakshit Shetty : కన్నడ నటుడు రక్షిత శెట్టిపై కేసు నమోదు..
కన్నడ స్టార్ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టి పై కేసు నమోదైంది.
- Thota Vamshi Kumar
- Published On : July 15, 2024 / 02:36 PM IST
FIR against Kannada actor Rakshit Shetty and his production house
Rakshit Shetty : కన్నడ స్టార్ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టి పై కేసు నమోదైంది. యశ్వంతపుర పోలీస్ స్టేషన్‌లో ఎంఆర్‌టి మ్యూజిక్ కంపెనీ రక్షిత్ శెట్టిపై ఫిర్యాదు చేసింది. తమ సంస్థకు చెందిన పాటలను కాపీ కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణసంస్థ పరంవా స్టూడియోస్..‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ మూవీల్లోని పాటలను ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమాలో కాపీ కొట్టారని తెలిపింది.
తమ అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై స్పందించాల్సిందిగా నటుడికి నోటీసులు పంపారు. కాగా.. ఈ ఆరోపణపై రక్షిత్ శెట్టి లేదా అతని బృందం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు.
యోగేశ్, అచ్యుత్ కుమార్, దిగంత్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘బ్యాచిలర్ పార్టీ’. అభిజిత్ మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పరంవా స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి ఈ సినిమాని నిర్మించారు. ఈ ఏడాది జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
ఇదిలా ఉంటే.. ఆయా పాటలకు వాడుకోవడంపై ఈ ఏడాది జనవరిలో రక్షిత్ శెట్టి, ఎంఆర్‌టీ స్టూడియోస్ మధ్య చర్చలు జరిగినా అవి సఫలం కాలేదని సమాచారం.
