Deadpool & Wolverine : హాలీవుడ్ సినిమాకి కటౌట్స్ పెట్టి.. ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా నాయనా.. రిలీజ్ కి ముందే..

ఏకంగా హాలీవుడ్ సినిమాలకి కూడా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు ఫ్యాన్స్.

Deadpool & Wolverine : హాలీవుడ్ సినిమాకి కటౌట్స్ పెట్టి.. ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా నాయనా.. రిలీజ్ కి ముందే..

Fans Celebrating Hollywood Movie Deadpool & Wolverine Releasing Celebrations at Theaters Videos goes Viral

Updated On : July 15, 2024 / 11:42 AM IST

Deadpool & Wolverine : మార్వెల్, డీసీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా ఈ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. మార్వెల్ సినిమాల యూనివర్స్ నుంచి త్వరలో డెడ్ పుల్ & వాల్వరిన్ రాబోతుంది. జులై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.

Also Read : KA Teaser : కిరణ్ అబ్బవరం ‘క’ టీజర్ రిలీజ్.. కిరణ్ మాస్ విశ్వరూపం చూపించబోతున్నాడా?

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు థియేటర్స్ బయట కటౌట్స్ పెట్టి, బ్యానర్లు కట్టి అభిమానులు హంగామా చేస్తారని తెలిసిందే. మన తెలుగు వాళ్ళు అయితే వేరే పరిశ్రమల హీరోలకు, హీరోయిన్స్ కి కూడా కటౌట్స్ పెట్టి రచ్చ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాలకి కూడా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ వద్ద డెడ్ పుల్ & వాల్వరిన్ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రిలీజ్ కి ముందే మార్వెల్ ఫ్యాన్స్ ఆ రెండు పాత్రల కటౌట్స్ పెట్టి పేపర్లు ఎగరేస్తూ, బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు.

దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారడంతో హాలీవుడ్ సినిమాలకు కూడా ఈ రేంజ్ సెలబ్రేషన్స్ ఏంట్రా నాయనా అని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే డెడ్ పుల్ & వాల్వరిన్ ట్రైలర్ కూడా రిలీజయింది. ఇద్దరు సూపర్ హీరోలు కలిసొస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.