KA Teaser : కిరణ్ అబ్బవరం ‘క’ టీజర్ రిలీజ్.. కిరణ్ మాస్ విశ్వరూపం చూపించబోతున్నాడా?

తాజాగా కిరణ్ అబ్బవరం 'క' సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

KA Teaser : కిరణ్ అబ్బవరం ‘క’ టీజర్ రిలీజ్.. కిరణ్ మాస్ విశ్వరూపం చూపించబోతున్నాడా?

Kiran Abbavaram Biggest Movie KA Teaser Released

Updated On : July 15, 2024 / 11:17 AM IST

KA Teaser : ఇటీవల కిరణ్ అబ్బవరం ‘క’ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరు డైరెక్టర్స్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా ‘క’ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది.

తాజాగా ‘క’ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే.. హీరో ఎక్కడ్నుంచో ఓ ఊరికి పోస్ట్ మెన్ గా వచ్చి అక్కడ ఏదో చేస్తున్నాడు, మంచివాడిగా కనిపించే చెడ్డోడు అని ఆసక్తిగా ఉంది. ఇక ఇది పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతుంది. టీజర్ తోనే కిరణ్ అబ్బవరం సినిమాలో మాస్ విశ్వరూపం చూపించబోతున్నాడని తెలుస్తుంది. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా టీజర్ చూసేయండి..

ఇక ఈ ‘క’ సినిమాని ఏకంగా 20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇన్నాళ్లు లవ్, కమర్షియల్ సినిమాలతో పలకరించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు రూటు మార్చి సరికొత్త కాన్సెప్ట్ తో భారీ పీరియాడిక్, భారీ బడ్జెట్ వస్తున్నాడు. మరి ఈ సినిమాలో కిరణ్ ఏ రేంజ్ లో తన నటనతో మెప్పిస్తాడో చూడాలి.