×
Ad

Dhurandhar : రిలీజ్‌కి ముందు సూపర్ హిట్ సీక్వెల్ సినిమాపై కేసు నమోదు.. పర్మిషన్ లేకుండా అలా చేసినందుకు..

నేడు ధురంధర్ 2 టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమా మార్చ్ 19 న రిలీజ్ కానుందని ప్రకటించారు. (Dhurandhar)

Dhurandhar

Dhurandhar : ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ సినిమా ఆల్మోస్ట్ 800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ ధురంధర్ 2 కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.(Dhurandhar)

నేడు ధురంధర్ 2 టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమా మార్చ్ 19 న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఈ సూపర్ హిట్ సీక్వెల్ సినిమా రిలీజ్ కి ముందు సినిమా యూనిట్ పై కేసు నమోదు అవడం సంచలనంగా మారింది.

Also Read : Divi : నెగిటివిటీ పోగొట్టడానికి స్నానం చేసేటప్పుడు.. దివి ఏం చేస్తుందో తెలుసా..?

పార్ట్ 2 కి సంబంధించి మిగిలిన కొంత షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతుంది. సంజయ్ దత్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్లేస్ లో డ్రోన్స్ ఎగురవేయడానికి అనుమతి లేదు. కానీ ధురంధర్ సినిమా షూటింగ్ కోసం ఈ ప్రదేశంలో డ్రోన్ ఎగురవేశారు.

దీంతో ఈ సినిమా లొకేషన్ మేనేజర్‌పై FIR నమోదు చేయబడింది. దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్‌ను ఎగురవేయడంతో ఈ సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ పై ఫిబ్రవరి 1న MRA మార్గ్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై FIR నమోదు చేసారు. దీనిపై లొకేషన్ మేనేజర్ కానీ, నిర్మాత కానీ మూవీ యూనిట్ కానీ ఇంకా స్పందించలేదు.

Also See : Eesha Rebba : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఈషారెబ్బ.. ఫొటోలు..

త్వరలో ధురంధర్ 2 రిలీజ్ కాబోతుండగా ఇలా కేసు నమోదు కావడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది. మరి దీనిపై మూవీ యూనిట్ స్పందిస్తుందా లేదా చూడాలి.