మీకు మాత్రమే చెప్తా – ఫస్ట్ లుక్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న'మీకు మాత్రమే చెప్తా' ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Publish Date - August 30, 2019 / 03:12 AM IST

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న’మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్ లుక్ రిలీజ్..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా,  డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, తన సొంత ప్రొడక్షన్‌లో ఓ సినిమాని నిర్మించనున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటించబోయే చిత్రాన్ని తాను నిర్మించనున్నట్టు.. ఆ సినిమాకు ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వీడియో ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.

విజయ్ ఇప్పుడు మీకు మాత్రమే చెప్తా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు కూడా అనౌన్స్ చేశాడు.. ఈ సినిమా ద్వారా షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అభినవ్, అనసూయ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు..

Read Also : సాహో – యూఎస్ టాక్..

పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.. మ్యూజిక్ : శివకుమార్, సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, ఆర్ట్ : రాజ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ..