Celebs Remuneration: నాడు వెయ్యి పారితోషికం.. నేడు కోట్లల్లో.. కథ మారిపోయింది

ఇప్పుడు అందంగా వెలుగు జిలుగులుతో సాగుతున్న మన సినీ తారల జీవితం వెనుక ఎన్నో కష్టాలు దాగుంటాయి. నిజానికి ఎవరి కెరీర్ గ్రాఫ్ అయినా ఉన్నపళంగా పైకి ఎగబాకదు. దాని వెనుక వారి కష్టం.. కొంత అదృష్టం తోడై వారిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంది.

Bollywood Five Celebs Remuneration: ఇప్పుడు అందంగా వెలుగు జిలుగులుతో సాగుతున్న మన సినీ తారల జీవితం వెనుక ఎన్నో కష్టాలు దాగుంటాయి. వెండి తెర మీద వెలిగిపోవాలని కలలు కనడమే కాకుండా ఆ కలలను సాకారం చేసుకోవడంలో వేసిన తొలి అడుగు వారి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టంగా పేర్కొనాలి. నిజానికి ఎవరి కెరీర్ గ్రాఫ్ అయినా ఉన్నపళంగా పైకి ఎగబాకదు. దాని వెనుక వారి కష్టం.. కొంత అదృష్టం తోడై వారిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంది.

ఇప్పుడు ఇండియన్ సినిమా చెరగని ముద్ర వేసిన వారంతా మొదట్లో అవకాశాల కోసం చేయి చాచిన వారే కాగా చేసిన కష్టానికి అదృష్టం కలిసి వచ్చి నేడు డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వచ్చింది చిన్న అవకాశమైనా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ అందలం ఎక్కిస్తుంది. బడా బడా హీరోలంతా ఒకప్పుడు అలా ఒక్కోమెట్టు ఎక్కినవారే. ఇక కెరీర్ మొదట్లో వారి జీతం వందల్లో ఉంటే.. ఇప్పుడు అది కోట్లకు చేరింది. ఆలాంటి బాలీవుడ్ హీరోలలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అక్షయ్ కుమార్

Bollywood Five Celebs Remuneration

బాలీవుడ్‌ సక్సెస్ హీరోలలో అక్షయ్ కుమార్ కెరీర్ అసాధారణమైనదని చెప్పుకోవాలి. అక్షయ్ హీరోగా ముంబైలో అడుగుపెట్టక ముందు బ్యాంకాక్‌లో చెఫ్, వెయిటర్‌గా పనిచేశాడు. బీ టౌన్ వీధులలో అడుగుపెట్టే నాటికి అక్షయ్ దగ్గర కనీసం లక్ష విలువ చేసే ఆస్థి కూడా లేకపోగా వైవిధ్యమైన కథలకు తన నటనతో ప్రాణంపోసి నేడు కోట్లకు అధిపతిగా మారాడు. అక్షయ్ తొలి సంపాదన రూ.1500 రూపాయలు కాగా నేడు బి-టౌన్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో అక్షయ్ ఒకడు. ఓ పత్రిక పేర్కొన్న వివరాల ప్రకారం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అక్షయ్ తాను నటించబోయే తర్వాత సినిమా కోసం ఏకంగా రూ.120 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిపింది.

మొదటి ఆదాయం: రూ.1500
ప్రస్తుత ఆదాయం: ఒక్కో సినిమాకు రూ.120 కోట్లు

2. అమితాబ్ బచ్చన్

Bollywood Five Celebs Remuneration

ఆ బొంగురు గొంతుతో సినిమాకు కష్టమని ఒకప్పుడు పనికి రావని తిరస్కరించిన ఆ యువకుడే నేడు ఇండియన్ సినిమా మెగాస్టార్ అయ్యారంటే దాని వెనుక ఎంత కష్టం దాగుందో అర్థం చేసుకోవచ్చు. అమితాబ్‌ని చూసిన దర్శక, నిర్మాతలు సినిమాకే పనికిరావన్నా ఆయన ఏ మాత్రం ఫీలవలేదు. ఎక్కడ కాదన్నారో అక్కడే విజయాన్ని వెతుక్కున్న బిగ్ బీ ఓ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ నెలకు రూ.500 జీతంతో తన కెరీర్‌ని ఆరంభించి నేడు రూ.2800 కోట్లకు అధిపతిగా మారాడు.

మొదటి ఆదాయం: రూ.500
ప్రస్తుత ఆదాయం: ఒక్కో సినిమాకు రూ.18-20 కోట్లు

3. అమీర్ ఖాన్

Bollywood Five Celebs Remuneration

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ఎవరంటే అన్ని వేళ్ళూ అమిర్ వైపే చూపిస్తాయి. అతని పనితనం గురించి ఇంతకి మించి చెప్పుకొనేందుకు గొప్పగా ఏముంటుంది. దర్శక, నిర్మాతలు అమిర్ కోసమే.. అమీర్ తో మాత్రమే చేయాలనుకొనే గొప్ప సినిమాలను తెచ్చిన ఈ నటుడు కెరీర్ ఆరంభంలో నెలకు వెయ్యి రూపాయల సంపాదనతోనే అడుగుపెట్టాడు. అమిర్ తొలి సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ కోసం రూ.11,000 రూపాయలు అందుకోగా ఆ సినిమా కోసం 11 నెలల సమయం పట్టిందట. కానీ నేడు ఒక్కో సినిమాకు యాభై కోట్ల పైగా పారితోషకం అందుకుంటూ ఏడాదికి రెండు సినిమాలను సైతం చుట్టేస్తున్నాడు.

మొదటి ఆదాయం: రూ.11,000
ప్రస్తుత ఆదాయం: ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు

4.ప్రియాంక చోప్రా

Bollywood Five Celebs Remuneration

ఇండియన్ సినిమా అంటే ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. హీరో డామినేషన్ ఇండస్ట్రీ. ఇక్కడ హీరోయిన్స్ హీరోలతో సమానంగా క్రేజ్ దక్కించుకోవడం.. వారి స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం అంత సులభం కాదు. కానీ ప్రియాంకా చోప్రా హీరోలను మించి విజయాన్ని అందుకోవడంతో పాటు ముంబై, న్యూయార్క్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు ప్రియాంక లెక్కకు కొదువేలేదు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన పీసీ 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నప్పుడు ఆమె మొదట అందుకున్న పారితోషకం రూ.5000 రూపాయలే కాగా నేడు అదే ప్రియాంకా జస్ట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌కు రూ.1.80 కోట్లు అందుకుంటుండగా ఒక్కోసినిమాకు రూ.22 కోట్లు వసూలు చేస్తుంది.

మొదటి ఆదాయం: రూ.5000
ప్రస్తుత ఆదాయం: ఒక్కో సినిమాకు రూ.22 కోట్లు

5. షారూఖ్ ఖాన్

Bollywood Five Celebs Remuneration

షారుక్ ఈ మధ్య కాస్త వెనక్కు పడిపోయాడా అన్న భావన కలుగుతుంది కానీ ఒకనాడు బాలీవుడ్ లో సినిమా భారీ సక్సెస్ అయిందంటే అందులో సెక్స్ అయినా ఉండాలి.. లేదంటే షారుక్ అయినా ఉండాలని పేరు ఉండేదంటే షారుక్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బీ టౌన్ ను ఎక్కువకాలం అగ్రస్థానంలో ఏలిన నటుడు కూడా షారుక్ మాత్రమేనని చెప్పుకోవాలి. నటుడిగానే కాదు ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్‌తో విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా షారుక్ కు పేరుంది. అయితే.. షారుఖ్ తన మొదటి జీతంగా రూ.50 సంపాదించగా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ చిత్రం కోసం ఖాన్ 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడంటే షారుఖ్ క్రేజ్ నేటికీ తగ్గలేదనిపిస్తుంది.

మొదటి ఆదాయం: రూ.50
ప్రస్తుత ఆదాయం: ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు

ట్రెండింగ్ వార్తలు