Vijay : విజయ్ కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. ఫిట్నెస్ ట్రైనర్ కామెంట్స్..
విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ హెల్త్, ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Vijay)
- Saketh U
- Published on- May 13, 2026 / 01:53 PM IST
Tamilnadu CM Vijay
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. దీంతో పలువురు సెలబ్రిటీలు, విజయ్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు ఆయన గురించి చెప్తున్నారు.
ఈ క్రమంలో విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ హెల్త్, ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Mehreen Pirzada : హీరోయిన్ మెహరీన్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు..
నరేష్ కుమార్ మాట్లాడుతూ.. విజయ్ మొదట్నుంచి డెడికేషన్, క్రమశిక్షతో ఉండేవారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేసేవారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన ఫుడ్, వ్యాయమ పద్దతులను వదల్లేదు. ర్యాలీల కోసం బయటకు వెళ్తే ఇంటి దగ్గర్నుంచి ఫుడ్ తీసుకెళ్లేవారు. ఆయన బయటి ఫుడ్ అసలు తినరు.
51 ఏళ్ళ వయసులో కూడా ఆయన యువకులకు పోటీగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఆయన క్రమశిక్షణ, కష్టం ఉంది. ఆయన ఎక్కువ సైక్లింగ్, రన్నింగ్ చేస్తారు. ఒత్తిడి ఉన్నప్పుడు జిమ్ లో ఎక్కువగా గడిపి మనసును తేలికపరుచుకుంటారు. ఇప్పటివరకు కూడా ఆయనకు మోకాలి సమస్యలు, నడుము నొప్పి.. లాంటి ఏ ఆరోగ్య సమస్యలు లేవు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడమే ఇందుకు కారణం అని తెలిపారు.
Also Read : CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తీవ్ర విమర్శల వేళ ఓఎస్డీ నియామకం రద్దు..
