Pushpa 2 : అప్పుడు సామీ.. ఇప్పుడు పీలింగ్స్.. సాంగ్స్ కోసం ఫోక్ సింగర్స్ ను తీసుకొచ్చిన సుకుమార్..

తాజాగా పీలింగ్స్ సాంగ్ రిలీజ్ చెయ్యగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

Folk singers for Allu Arjun pushpa 2 movie special songs

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి రెడీ గా ఉంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ గా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఈవెంట్స్ ముంబై, పాట్నా, చెన్నై, కొచ్చి లో చెయ్యగా నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 వైల్డ్ వైర్ ఈవెంట్ కి సర్వం సిద్ధం..

కాగా ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా సాంగ్స్ మాత్రం ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా పీలింగ్స్ సాంగ్ రిలీజ్ చెయ్యగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అయితే పుష్ప సినిమాలో ఏదో ఒక్క పాట కోసమైనా తెలుగు ఫోక్ సింగర్స్ ను ఎంచుకుంటున్నాడు సుక్కు. ఇందులో భాగంగానే పుష్ప 1 లో ‘సామీ సామీ..’ పాటను ఫోక్ సింగర్ మౌనిక తో పాడించారు. కాగా ఇప్పుడు పుష్ప 2లో ‘పీలింగ్స్..’ సాంగ్ ను ఫోక్ సింగర్ లక్ష్మి తో పాడించారు.

అయితే పుష్ప 1లోని సామీ సామీ సాంగ్ అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఒక ఫోక్ సింగర్ పాడిన పాట ఇంతటి హిట్ కావడంతో.. ఈ సారి కూడా పీలింగ్స్ సాంగ్ ను ఫోక్ సింగర్ తోనే పాడించారు. ఎంతో మంది స్టార్ సింగర్స్ ఉన్నప్పటికీ ఒక్క సాంగ్ కోసం ఫోక్ సింగర్స్ ను తీసుకొని మంచి అవకాశాన్ని ఇస్తున్నారు సుక్కు. ఇకపోతే ఫోక్ సింగర్స్ వాయిస్ సాధారణ సింగర్స్ వాయిస్ కంటే కాస్త భిన్నంగా, ఎక్కువ బేస్ కలిగి ఉండడం వల్లే సుక్కు ఈ సింగర్స్ తో పాడించినట్టు తెలుస్తుంది. పుష్ప 1లో ఫాలో అయిన ఫోక్ సింగర్ సెంటిమెంట్ నే పుష్ప 2 లో కూడా ఫాలో అయ్యాడు సుక్కు. అలా ఈ రెండు పాటలు ట్రెండింగ్ సాంగ్స్ గా నిలిచాయి.