OTT Release: సరుకు సిద్ధం.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!
ఈ వీక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేకపోవడంతో ఓటీటీలు సరుకు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ దొరుకుతున్నాయి.
- Naresh Mannam
- Published On : February 7, 2022 / 03:27 PM IST
Ott Release
OTT Release: ఈ వీక్ కూడా థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేకపోవడంతో ఓటీటీలు సరుకు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ దొరుకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ కోసం స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ కూడా ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. తగ్గేదే లే అన్నట్టు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేస్తున్నాయి ఓటీటీలు. పోటాపోటీగా కంటెంట్ ను అప్ లోడ్ చేసేందుకు రెడీ అయ్యాయి.
Srikanth Addala: బాలయ్యతో కాదు రానాతో క్లాస్ దర్శకుడి చర్చలు!
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
తమిళ స్టార్ హీరో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్, సిమ్రన్, బాబ్ సింహా తదితరులు నటించి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన మహాన్ అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10 ప్రసారం కానుంది. బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొణె, అనన్య పాండే నటించిన గ్రెహాహియా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 11న ప్రసారం కానుంది. షకున్ బత్రా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సుమంత్, నైనా గంగూలీ, వెన్నెల కిషోర్ నటించి.. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన మళ్ళీ మొదలైంది సినిమా జీ5లో ఫిబ్రవరి 11న ప్రసారం కానుంది.
Film Tickets Issue : చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ – మంచు విష్ణు
ప్రియమణి, జానీ విజయ్, శరణ్య ప్రదీప్ నటించి.. అభిమన్యు దర్శకత్వం వహించిన భామా కలాపం ఆహాలో ఫిబ్రవరి 11న ప్రసారం కానుంది. శ్రుతిహాసన్, మిథున్ చక్రవర్తి, గౌహర్‌ఖాన్ నటించి.. ముకుల్ అభయంకర్ దర్శకత్వం వహించిన బెస్ట్ సెల్లర్ అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 18న ప్రసారం కానుంది. రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణె, జీవా నటించి.. కబీర్ సింగ్ దర్శకత్వం వహించిన 83 నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్ లో ఫిబ్రవరి 18న ప్రసారం కానుంది. మాధురీ దీక్షిత్, సంజయ్ కపూర్, మానవ్ కౌల్ నటించి.. బెజోయ్ నంబియార్, కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహించిన ఫేమ్ గేమ్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 24న ప్రసారం కానుంది.
