Srikanth Addala: బాలయ్యతో కాదు రానాతో క్లాస్ దర్శకుడి చర్చలు!

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలను తెరకెక్కించిన క్లాస్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా వెంకటేష్ నారప్ప రీమేక్ తో మాస్ టచ్.

Srikanth Addala: బాలయ్యతో కాదు రానాతో క్లాస్ దర్శకుడి చర్చలు!

Srikanth Addala

Updated On : February 7, 2022 / 3:04 PM IST

Srikanth Addala: కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలను తెరకెక్కించిన క్లాస్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా వెంకటేష్ నారప్ప రీమేక్ తో మాస్ టచ్ చేశాడు. అయితే.. ఈసారి బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేసుకున్నాడని.. ఇప్పటికే బాలయ్యకి ఆ కథ కూడా వినిపించాడని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి.

Singer Revanth : గుంటూరులో సింపుల్‌గా సింగర్ రేవంత్ వివాహం

అయితే.. బాలయ్యతో చర్చలు ఏమయ్యాయో కానీ ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు దగ్గుబాటి హీరో రానాతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడట. ఆ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కూడా శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అది ఏమైందో ఏమో కానీ ఇప్పుడు రానా కోసం శ్రీకాంత్ ఓ కథను సిద్ధం చేసుకున్నాడని.. ఇప్పటికే రానాకి కూడా కథ వినిపించాడని చెప్తున్నారు.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ ఆస్తులు ఎవరికి??

నిజానికి బాలయ్యతో సినిమాకు శ్రీకాంత్ వెనుక దిల్ రాజు ఉండే తతంగం నడిపించాడని.. ఆ సినిమాను దిల్ రాజే నిర్మించనున్నాడని చెప్పుకున్నారు.ఇంతకీ బాలయ్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ.. ఆ సినిమాతో పాటు రానాతో మరో సినిమాకి శ్రీకాంత్ సిద్దమవుతున్నాడు. ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తుంది. మరి శ్రీకాంత్ రానా కోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడు.. ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది చూడాలి.