Full Length Comedy Entertainer Mad Movie Ready to plan Sequel
MAD Movie Sequel : నార్నె నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో నిర్మాత నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. మ్యాడ్ సినిమా అక్టోబర్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.
కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాడ్ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పెద్ద హిట్ గా నిలిచింది. కాలేజీ స్టూడెంట్స్ కథాంశంతో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా మ్యాడ్ సినిమా ప్రేక్షకులందర్నీ ఫుల్ గా రెండు గంటలపాటు థియేటర్స్ లో నవ్వించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇంత మంచి విజయం సాధించిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
Also Read : Nikhil Siddhartha : హీరో నిఖిల్ భార్యకు సీమంతం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిఖిల్..
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలోనే అదే దర్శకుడితో అదే ఆర్టిస్టులతో పాటు ఇంకొంతమంది కొత్త వాళ్ళతో కలిపి మ్యాడ్ 2 సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నట్టు, సమ్మర్ లో ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తారని, మ్యాడ్ 2 కూడా ఫుల్ లెంగ్త్ కామెడిగానే తెరకెక్కిస్తారని తెలుస్తుంది. మరి మ్యాడ్ 2 కూడా థియేటర్స్ లో ఫుల్ గా నవ్విస్తుందేమో చూడాలి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.